EPAPER

Fake Medicines: చాక్ ‌పీస్ పౌడర్‌తో మెడిసిన్స్.. అంతరాష్ట్ర నకిలీ మందుల ముఠా అరెస్ట్.

Fake Medicines: చాక్ ‌పీస్ పౌడర్‌తో మెడిసిన్స్.. అంతరాష్ట్ర నకిలీ మందుల ముఠా అరెస్ట్.

Fake medicinesFake Medicines: తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర నెట్‌వర్కను విచ్చిన్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో చాక్ పీస్ పౌడర్‌తో మందులు తయారు చేసే ముఠాను పట్టుకున్నారు


ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందులను తెలంగాణకు విక్రయించింది.

తయారు చేసిన మందులను సిప్లా, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే), ఆల్కెమ్.. అరిస్టో వంటి ప్రఖ్యాత కంపెనీల లేబుల్‌లు ఉన్నాయి. అయితే అవి నిజానికి ఛాక్ పీస్ పౌడర్‌తో తయారు చేసిన మందులు.


ఆగ్మెంటిన్ – 625, క్లావమ్ – 625, ఓమ్నిసెఫ్-ఓ 200, మాంటైర్ – ఎల్‌సి నకిలీలను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు నిందితులు అంగీకరించారు.

ఫ్యాక్టరీ ఇండియాలో సగానికిపైగా రాష్ట్రాలకు చాక్ పీస్ పౌడరం సరఫరా చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

మలక్‌పేట్‌లో జరిగిన దాడిలో 27,200 నకిలీ యాంటీబయాటిక్ MPOD టాబ్లెట్ల కార్టన్ బయటపెట్టిన తర్వాత ఈ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. వీటి విలువ ₹7.43 లక్షలు. అదనంగా, మూసారం బాగ్ సమీపంలో ఒక వ్యక్తి స్టాక్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు.

ఈ వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు: నకిలీ డ్రగ్స్ కోసం ఆర్డర్‌లు ఇచ్చిన కొనుగోలుదారులు, పంపిణీదారులు, నకిలీ లేబుల్‌లను ఏర్పాటు చేసిన వ్యక్తులు, డ్రగ్స్ తయారీ, ప్యాకింగ్‌లో పాల్గొన్నవారు, నకిలీ ఔషధాల తయారీని అనుమతించిన యూనిట్ CEO ఇలా ఎంతో మంది ఉన్నారు. అధికారులు తయారీదారులు సచిన్ కుమార్, విశాద్ కుమార్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×