EPAPER

Medigadda Barrage Damage Facts : నాడు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కాలేదని వాదన.. ఇప్పుడేమంటారు హరీష్ రావు..?

Medigadda Barrage Damage Facts : నాడు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కాలేదని వాదన.. ఇప్పుడేమంటారు హరీష్ రావు..?
Political news today telangana

Medigadda Barrage Damage Issue(Political news today telangana): మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిందని వార్తలు రాగానే తొలుత బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆ ప్రాజెక్టుకు ఏమీ నష్టం జరగలేదని అన్నట్టు కిమ్మనకుండా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రోజు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ లో డ్యామేజ్ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనికి అన్ని బ్యారేజ్ లది ఇదే పరిస్థితి అని నాడు కాంగ్రెస్ నేతలు మొత్తుకున్నారు.


ఎన్నికల సమయంలో మేడిగడ్డ అంశంపై హాట్ టాపిక్ గా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడటం వల్లే ప్రాజెక్టులకు ఈ పరిస్థితి దాపురించిందని రేవంత్ రెడ్డి అనేకసార్లు విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని హెచ్చరించారు.

తొలుత సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత మేడిగడ్డపై స్పందించారు. బ్యారేజ్ కు డ్యామేజ్ జరగలేదని అప్పటి మంత్రి హరీశ్ రావు సన్నాయి నొక్కులు నొక్కారు. రెండు పిల్లర్ల మధ్య ఉండే గ్యాప్ ను చూసి పగుళ్లు అని ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు పెట్టి కాంగ్రెస్ నేతలను హేళన చేసే ప్రయత్నం చేశారు.


Read More: ఎంత నమ్మక ద్రోహం కేసీఆర్..!

వాస్తవాలు తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రాజెక్టుల్లో జరిగిన డ్యామేజ్ పై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అంతముందుకు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ .. ఎన్నికల సమయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ ను లక్ష్యంగానే విమర్శలు చేశారు తప్ప.. తాను నిర్మించిన ప్రాజెక్టుల గురించి గొప్పలు చెప్పుకోలేకపోయారు.

బీఆర్ఎస్ హయాంలో తమకు జరిగిన నష్టం గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. గులాబీ కోటను కూల్చేశారు. కాంగ్రెస్ కు అధికారం అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒకవైపు విచారణ కొనసాగుతోంది. బ్యారేజ్ నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పుడు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇప్పడు ఏమంటారు హరీశ్ రావు అని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. మేడిగడ్డలో పగుళ్లు కనిపించాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×