EPAPER

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

– ఈనెల 5న రఘునాథపాలెంలో ఎన్‌కౌంటర్
– నిజనిర్ధారణకు వెళ్లిన పౌరహక్కుల నేతలు
– అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– అశ్వాపురం పీఎస్‌కు తరలింపు


Fact Finding Team: ఈనెల 5న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న కూడా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహించినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణతో కలిసి 14 మంది రఘునాథపాలెం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిని మణుగూరు దగ్గర ఆపి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్ గేట్‌కు తాళం వేశారు. మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై పౌర హక్కుల నేతలు మండిపడుతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ దీనిపై స్పందిస్తూ, 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, అక్కడ అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిజనిర్ధారణ అనేది 50 ఏళ్ల నుంచి జరుగుతున్నదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఎన్‌కౌంటర్ జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు హరగోపాల్.

Also Read: Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే


ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని పువ్వర్తి పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా పోలీసు భద్రతా శిబిరంపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. యూబీజీఎల్ రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ప్రతిఘటించలేక మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. సుక్మా జిల్లా జాగురుగుండ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పువ్వర్తిలో ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×