EPAPER

Vinod Kumar: భర్తీ మాది.. క్రెడిట్ మీకా.. ? ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఫైర్

Vinod Kumar: భర్తీ మాది.. క్రెడిట్ మీకా.. ? ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఫైర్

హైదరాబాద్, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ‌ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఏ విషయాన్నైనా మార్కెటింగ్ చేసుకోవడంలో సీఎం రేవంత్ నెంబర్ వన్ అని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల‌ హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష 60వేల ఉద్యోగాలు నింపలేదని‌ భట్టి విక్రమార్క చెప్పగలరా అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను కోదండరాం తీసుకోవాలన్నారు.


Also Read:కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

జేఏసీని నడిపిన అనుభవం ఉన్న‌ కోదండరాం, సీఎంకు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో‌ కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదన్న వినోద్, చేసిన పనికి కేసీఆర్ ప్రచారం చేసుకోకపోవడం వలనే నష్టపోయామని అన్నారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష 61వేల 572 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని, తాము నింపిన ఉద్యోగాల సమాచారం మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యమని అన్నారు వినోద్ కుమార్.


Related News

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

CM Revanth: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: థాంక్యూ.. సీఎం సార్: బీసీ సంఘాల నేతలు

CM Revanth Reddy: ఆదాయ మార్గాలపై ఫోకస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Bathukamma: ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

Big Stories

×