EPAPER

Harish Rao & KTR Delhi Tour: ఢిల్లీకి బీఆర్ఎస్ అగ్రనేతలు.. కవిత బెయిల్ కోసం?

Harish Rao & KTR Delhi Tour: ఢిల్లీకి బీఆర్ఎస్ అగ్రనేతలు.. కవిత బెయిల్ కోసం?

Harish Rao and KTR Delhi Tour(Political news in telangana): బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారు. మధ్యం విధానంలో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారు ఢిల్లీకి వెళ్లడం పట్ల కొందరు రాజకీయ నాయకుల వాదన మరోలా ఉంది. వీళ్లిద్దరు కవితకు బెయిల్ తో పాటు బీజేపీ అగ్రనాయకులతో కలుస్తున్నారని. బీజేపీతో ములాఖత్ అయ్యి కవితను విడిపిస్తారని కొందరు చెబుతున్నారు. మరి కొందరు బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్దామని సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు.


మొన్నీమధ్యే హరీశ్ రావు కవితను కలిశారు. వారంలోనే మరోసారి కవితతో సమావేశం అయ్యారు హరీశ్ రావు. ఇక కేటీఆర్ తో కలిసి హరీశ్ రావు ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ లో గ్రేటర్ మీటింగ్ ను తలసానికి అప్పగించి హస్తినకు చేరుకున్నారు దీనిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్ధరు బీజేపీ నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్లార‌ని, బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కోసం కేసీఆర్ వీళ్లిద్దరిని పంపార‌ని కొన్ని వర్గాల్లో టాక్ ఉంది. గులాబీ నాయకుల ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్-బీజేపీ ములాఖ‌త్ అంటూ కాంగ్రెస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. క‌విత‌ను బ‌య‌ట‌కు తీసుక‌రావ‌టం, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు బీజేపీతో క‌లిసి ప‌నిచేసే ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ!

సోమ‌వారం బెయిల్ పిటీషన్ వేసినా నాలుగైదు రోజులు అక్కడే ఏం చేస్తారని.. ఢిల్లీ లిక్కర్ కేసును ఎవ‌రి త‌ర‌ఫున వాదించినా ముగ్గురు న‌లుగురు లాయ‌ర్లే వాదిస్తున్నారు. ఇక వారితో చ‌ర్చించేది ఏముంది. అంటూ కాంగ్రెస్ లోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ మద్యం అవకతవకల కేసులో కవితకు మరోసారి చుక్కుదురైంది. ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ కేసులోను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ వరకు పొడిగించింది. దీనిపై బీఆర్ఎస్ వివ‌ర‌ణ ఇచ్చింది. క‌విత బెయిల్ పిటీష‌న్ కోసం ఢిల్లీలో ఉన్నార‌ని, సుప్రీంకోర్టు వేస‌వి సెల‌వులు ముగిసిన త‌ర్వాత బెయిల్ పిటీష‌న్ వేస్తున్నామ‌ని, సోమ‌వారం వేసే అవ‌కాశం ఉన్నందున న్యాయ నిపుణుల‌తో మాట్లాడేందుకు సోమ‌వారం వ‌ర‌కు ఢిల్లీలోనే ఉంటార‌ని చెప్పింది.

Tags

Related News

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Konda Surekha: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

KVP: రండి మార్కింగ్ వేయండి.. నేనే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

Big Stories

×