EPAPER

KTR Job calendar: బూతులు తిట్టినా అదే పని చేస్తానంటున్నకేటీఆర్

KTR Job calendar: బూతులు తిట్టినా అదే పని చేస్తానంటున్నకేటీఆర్

KTR fires on congress leaders(Political news in telangana): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. శనివారం ఆఖరి రోజు కూడా హాట్ హాట్ గా సాగింది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలెవ్వరినీ బయట తిరగనివ్వం. తోలు తీస్తాం.. ఏమనుకుంటున్నార్రా మా గురించి అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇందుకు కౌంటర్ గా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్నిబూతులు తిట్టినా నిరుద్యోగుల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు.


ఎప్పటికీ నిరుద్యోగుల పక్షమే

తమ ప్రభుత్వం ఎప్పుడూ నిరుద్యోగుల పక్షమేనని అన్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ కంటితుడుపు మాటలు మాట్లాడుతున్నారు. నాడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని..ఇప్పుడు ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకిక రాగానే నిరుద్యోగులకు అండగా నిలబడతామని..ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీల భర్తీల వివరాలను పొందుపరిచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంపై విపక్షాలు ఆందోళన చేస్తూ వచ్చాయి. నిరుద్యోగులను కూడా రెచ్చగొడుతూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రచారం హడావిడితో జాబ్ క్యాలెండర్ వాయిదా వేస్తూ వచ్చారు. గత నెలలో బీఆర్ఎస్ నిరుద్యోగులతో తీవ్ర ఆందోళన చేసింది.


జాబ్ క్యాలెండర్ పై నమ్మకం లేదు

నిరుద్యోగులు కూడా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. అయితే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అక్టోబర్ లో విద్యుత్ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్, నవంబర్ మాసంలో టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

జాబ్ క్యాలెండర్ పై తమకు నమ్మకం లేదని ఇదేదో కంటి తుడుపు చర్యగా బీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేశాయి. దీనితో కేటీఆర్ నిరుద్యోగుల సమస్యపై అవసరమైతే ఢిల్లీలో ఆందోళన చేపడతామని, తమకు ఉద్యమాలు కొత్త కావని.. కాంగ్రెస్ నేతలు ఎంతగా రెచ్చిపోయి మిమ్మల్ని బూతులు తిట్టినా, ఘోరంగా అవమానించినా తాము మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటామని, కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి అసహనంతో అనుచితంగా మాట్లాడుతున్నారని పరోక్షంగా దానం నాగేందర్ పై వ్యాఖ్యలు చేశారు.

Related News

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Big Stories

×