Big Stories

Etela: పొంగులేటికి మళ్లీ ఈటల గాలం!.. ఫామ్‌హౌజ్‌లో సీక్రెట్ టాక్స్.. ఏంటి సంగతి?

Eetala-ponguleti

Etela: రెండు వారాల క్రితం. ఖమ్మంలోని పొంగులేటి నివాసం. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్.. తన బలగంతో కలిసి ఆయన ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపారు. పార్టీలోకి రారమ్మంటూ రోజంతా రిక్వెస్ట్ చేశారు. పొంగులేటితో పాటు జూపల్లి కూడా. 1+1 డీల్. కానీ, వాళ్లు ఇంకా బీజేపీలో చేరలేదు. ఈలోగా కర్నాటక రిజల్ట్స్ వచ్చాయ్. వాళ్లిద్దరు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ప్రచారం. ఈటల రాజేందర్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. పార్టీ పెద్దలతో చర్చించి వచ్చారు. కట్ చేస్తే…..

- Advertisement -

లేటెస్ట్‌గా హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌజ్. ఈటల, పొంగులేటి, జూపల్లి. వన్ టు వన్ మీటింగ్. నో గన్‌మెన్లు. నో పీఏలు. కంప్లీట్ సీక్రెట్ టాక్స్. గతంలోలాగా సపార్టీ సమేతంగా చర్చలు జరగలేదు. అంతా గప్‌చుప్‌గా, గంటల తరబడి మంతనాలు జరిపారు. చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్.

- Advertisement -

ఏం జరుగుతోంది? ఈటల ఢిల్లీ వెళ్లి రావడం.. ఇప్పుడిలా ఫాంహౌజ్‌లో చర్చలు జరపడం.. సంథింగ్ సంథింగ్. పొంగులేటి మీద ఫుల్ ప్రెజర్ ఉంది. ఏ పార్టీలో చేరుతారో తెలీక ఆయన అనుచరులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మరీ ఎక్కువ కాలం జంక్షన్లో నిలబడే పరిస్థితి లేదు. ఆత్మీయ సభలూ ముగిసిపోయాయి. ఇక తేల్చుడే మిగిలింది. వారం, పది రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలి. అటు, కాంగ్రెస్ నుంచి ఒత్తిడి పెరిగింది.. బీజేపీలో చేరాలని ఉన్నా.. కర్నాటక ఓటమితో డిఫెన్స్‌లో పడ్డారు పొంగులేటి, జూపల్లి. ఆ విషయం పసిగట్టే.. ఆలస్యం చేస్తే వాళ్లిద్దరూ చేయి జారిపోతారనుకుంది బీజేపీ. ఈటల అర్జెంట్‌గా ఢిల్లీ వెళ్లి రావడం.. వీళ్లతో సీక్రెట్ మీటింగ్ పెట్టడం చూస్తుంటే.. వారిద్దరికీ ఎలాగైనా కాషాయ కండువా కప్పేయాలని కమలనాథులు గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

ఊరికే రమ్మంటే వచ్చేస్తారా? ఉమ్మడి ఖమ్మంలో 10కి 10 సీట్లు పాత డిమాండ్. ఖమ్మంలో ఉనికే లేని బీజేపీ ఎన్నంటే అన్ని సీట్లు ఇచ్చేస్తుంది. అంతకుమించి డిమాండ్ చేస్తున్నారట పొంగులేటి. స్వతహాగా బిగ్ కాంట్రాక్టర్. ఆయన ఇంకేం కోరుకుంటారు? కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరహాలో ఎన్నివేల కోట్ల ప్రాజెక్టుపై కన్నేశారో? అంటున్నారు. ఓన్లీ కాంట్రాక్టులు ఇస్తే సరా? పవర్‌లోకొస్తే పదవులేమిస్తారనే దానిపైనా చర్చ జరుగుతున్నట్టు టాక్.

ఎందుకంటే, అప్పటికీ ఇప్పటికీ డిమాండ్ బాగా పెరిగిపోయింది మరి. పొంగులేటి పార్టీలో చేరడం ఇప్పుడు బీజేపీకి అత్యవసరం. ఆయన రాకపోతే.. ఇక బీజేపీలో చేరికలకు హ్యాండ్ బ్రేక్ పడినట్టే. పొంగులేటే పోనప్పుడు మిగతా నేతలు అస్సలు రారు. అసలే కర్నాటక దెబ్బతో కమలనాథుల దూకుడు ఆగిపోయింది. కాస్త జోరు పెరగాలంటే పొంగులేటి, జూపల్లిలు రావాలి. ఆ విషయం తెలిసే.. వీళ్లు డిమాండ్లు పెంచుతున్నారు. ఈటల బేరాలు ఆడుతున్నారు.. అని అంటున్నారు. ఈసారి డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే.. అందరినీ సైడ్ చేసి.. ఈటల రాజేందర్ ఒక్కరే.. పొంగులేటి, జూపల్లిలతో ఫేస్ టు ఫేస్ టాక్స్ చేస్తున్నారట. ఆయన పట్టుదలకు.. వీళ్లు పట్టు సడలిస్తారా? కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరుతారా? ఈటల విసిరిన ఈటెలకు చిక్కుతారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News