EPAPER

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్.. అందుకే కుంగిందన్న ఈఎన్ సీ..

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్.. అందుకే కుంగిందన్న ఈఎన్ సీ..

Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలులేవని నీటిపారుదల శాఖ జనరల్ ఈఎన్ సీ మురళీధర్ తేల్చి చెప్పారు. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందన్న ఆయన.. ఏడవ బ్లాక్ ​లో సమస్య వల్ల సెంటర్‌ పిల్లర్‌ కుంగిందని వెల్లడించారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.


శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజ్‌ 20వ పిల్లర్‌ భారీ శబ్ధంతో కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్‌ నిర్మాణానికి క్రస్ట్‌ మధ్య పగుళ్లురాగా.. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి డ్యామ్ లోని నీటిని దిగువకు విడుదల చేశారు. మరోపక్క బ్యారేజ్‌ కుంగిపోవడంతో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్ఠత తదితర అంశాలపై ఆరా తీసింది.

ఇక ఇదే అంశంపై హైదరాబాద్‌లోని జలసౌధలో కేంద్రం ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడో బ్లాక్ లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్‌ కుంగిందని.. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు నీటిపారుదల శాఖ జనరల్ ఈఎన్ సీ మురళీధరన్. క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయన్నారు. కాపర్ డ్యామ్‌కి వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని తెలిపారు.


మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంతో బీఆర్ఎస్‌ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కావాలనే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి.. 130 మంది చనిపోయారని.. వందల మంది గాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ ఘటనపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దానిపై ప్రతిపక్షాలు విమర్శిస్తునే ఉన్నాయని మండిపడ్డారు.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×