Big Stories

ED Focus On Sheep Scam in Telangana: గొర్రెల స్కాం 700కోట్లు.. రంగంలోకి ఈడీ

- Advertisement -
- Advertisement -

మాములుగా లెక్కల్లో లేని డబ్బు కనిపించింది అంటే అక్కడ ఈడీ వాలిపోతుంది. మరి 700 కోట్ల అవినీతి.. ప్లస్ ఈ స్కామ్‌కు ఇతర రాష్ట్రాల్లో కూడా లింక్స్‌ ఉన్నాయని ఆరోపణలు ఉండటంతో ఈడీ సైలెంట్‌గా ఎందుకు ఉంటుంది? ఎంట్రీ ఇచ్చేసింది. అసలు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంత మంది? వారి పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్స్.. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏయే జిల్లాల అధికారుల అకౌంట్స్‌లో ఎంత జమ చేశారు? ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి? లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులెంత? అవి ఏయే అకౌంట్స్‌లో క్రెడిట్ అయ్యాయి.

గొర్రెలను రవాణా చేయడానికి ఉపయోగించిన రవాణా ఏజెన్సీల సమాచారం ఏంటి? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ఎంత చేశారు? గొర్రెలకు ఎంత దాణా కొనుగోలు చేశారు? ఆ దాణాను ఏయే లబ్ధిదారులకు పంపారు? దానికి ఎవరు నిధులు ఇచ్చారు? ఇలా ప్రతి ఒక్క విషయం తమకు పంపండి అంటూ ఈడీ కోరింది. అంతేకాదు ఇప్పటి వరకు మీరు ఏం విచారించారు? దానికి సంబంధించిన నివేదికలను కూడా తమకు పంపాలని కోరింది.

Also Read: వణుకుతున్న బీఆర్ఎస్ నేతలు, నోటీసుల మీద నోటీసులు,

బాగుంది.. నిజంగా ఈడీ విచారణ అంటే లెక్కలు మొత్తం బయటికి వస్తాయి. ఎవరెవరు ఎంత లబ్ధి పొందారన్నది కూడా తెలుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ట్రాన్సాక్షన్స్‌ జరిగాయి కాబట్టి ఏసీబీ కంటే ఈడీ విచారణ బెటరే.. బట్.. ఇక్కడ ఈడీ ఎంట్రీ టైమింగే కాస్త అనుమానస్పదంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో సినారియో ఏంటి.. ? బీఆర్ఎస్‌ దుకాణం బంద్.. పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే అని తేలిపోయింది.

బీఆర్ఎస్‌కు ఒక్కసీట్‌ కూడా దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్‌ మాత్రం చెరో ఎనిమిది సీట్లు దక్కించుకున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో నేతల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉన్న కొద్దో గొప్పో నేతలు కూడా ఏ పార్టీలో చేరిపోదామా? అని లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుల దెబ్బకు అంతా కాంగ్రెస్‌లో చేరి తమను తాము కాపాడుకుందామనే భావనలో ఉన్నారు. అలాంటి టైమ్‌లో ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. అందుకే ఇప్పుడు ఈడీ ఎంట్రీని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి వస్తుంది.

బీజేపీకి సంబంధించి ఓ ప్రచారం ఉంది. ఎవరైనా మాట వినకపోతే ముందుగా బుజ్జగించడం .. లేదా బెదిరించడం.. అప్పటికీ దారిలోకి రాకపోతే సీబీఐ, ఈడీలను ఉసిగొల్పడం..ఇది మేము అంటున్న మాట కాదు.. పొలిటికల్ సర్కిల్స్‌లో ఉన్న ప్రచారం. మేం జస్ట్ గుర్తు చేస్తున్నాం అంతే.. అయితే ఈ కేసుతో బీజేపీకి ఏం లాభం అనే కదా మీ డౌట్.. కానీ ఉంది అనేది మా వాదన. ప్రస్తుతం తెలంగాణలో కాస్త పొలిటికల్ స్పేస్‌ ఏర్పడింది. అది బీఆర్ఎస్‌ వల్ల ఏర్పడింది. బీఆర్ఎస్‌ గ్రాఫ్ ప్రస్తుతం జీరో.. సో ఇది బీజేపీకి అంది వచ్చిన అవకాశం. ఇప్పటికే బీజేపీకి తెలంగాణలో ఓట్‌ షేర్ పెరిగింది. కానీ లీడర్ల కొరత వేధిస్తుంది. అంతేకాదు బీఆర్ఎస్‌ నుంచి జంప్ అవ్వాలనుకుంటున్న నేతలకు కూడా కాంగ్రెస్‌, బీజేపీలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇష్టంతోనో.. కష్టంతోనో.. అందరూ బీజేపీ వైపు చూడాలి అనేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగింది గొర్రెల పంపిణీ.. తవ్వితే అప్పట్లో ఉన్న నేతల చిట్టా మొత్తం బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో.. ఒక్కసారి ఈ కేసు మొత్తం ఈడీ హ్యాండోవర్‌లోకి వెళ్లిందంటే.. ఇన్‌డైరెక్ట్‌గా బీజేపీ ఈ కేసును టాకిల్‌ చేస్తుంది. నేతలపై వారికి కంట్రోల్ వస్తుంది. ఇదీ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో కొనసాగుతున్న డిస్కషన్.. మరి ఇది ఎంత వరకు నిజం? ఎంత వరకు అబద్ధం? అనేది తెలియదు కానీ.. ఈడీ ఎంట్రీ మాత్రం బీజేపీ పొలిటికల్ ఏజెండా అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు వ్యాఖ్యలు చేశారు. సో.. బీఆర్‌ఎస్‌ పని ఖతమని చెప్పకనే చెబుతున్నారు బీజేపీ నేతలు.. కానీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేది తామే అనేది ఆ పార్టీ నేతలు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్న మాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News