EPAPER
Kirrak Couples Episode 1

Tcongress : అప్పుడు సేవ్ కాంగ్రెస్ గుర్తుకు రాలేదా? .. ఉత్తమ్ కు అనిల్ ప్రశ్నలు..

Tcongress : అప్పుడు సేవ్ కాంగ్రెస్ గుర్తుకు రాలేదా? .. ఉత్తమ్ కు అనిల్ ప్రశ్నలు..

Tcongress : కాంగ్రెస్ లో ముసలం మరింత ముదురుతోంది. కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ముందుకెళుతున్నారు. అటు రేవంత్ వర్గం రాజీనామాలకు సిద్ధపడుతోందని తెలుస్తోంది. అలాగే అధిష్టానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై కాంగ్రెస్ నేత అనిల్ ఘాటుగా స్పందించారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పుకున్నప్పుడు సేవ్ కాంగ్రెస్ అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి రూ. 8 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అన్నారు. టికెట్ల విషయంలో ఎన్నో అక్రమాలు చేశారని విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. కానీ భట్టి విక్రమార్క వల్లే అప్పుడు తనకు టికెట్ దక్కిందని తెలిపారు.

రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం చేయడం లేదా ? అని కాంగ్రెస్ సీనియర్ నేతలను అనిల్ ప్రశ్నించారు. సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని తేల్చి చెప్పారు. ఉత్తమ్ కు వ్యతిరేకంగా కూడా సునీల్ పోస్టులు పెడుతున్నారని సీవీ ఆనంద్ చెబితే మీరు ఎలా నమ్ముతారని అనిల్ ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయని అనిల్ స్పష్టం చేశారు.


వార్ రూమ్ పై దాడి జరిగితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా పోరాటం చేశారని అనిల్ అన్నారు. కార్యకర్తలపై 11 వేల కేసులున్నాయని, వారంతా పార్టీ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. మీ మీద ఎన్ని కేసులున్నాయి ? పదవులు మీకు, కేసులు క్యాడర్ కా..? అని నిలదీశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వొద్దా అని అనిల్ నిలదీశారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×