Doctors Removed Tail to Baby Boy in AIIMS Bibinagar: సాధారణంగా పుట్టినపిల్లలు ఎంతో ఆరోగ్యంగా జన్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లిదండ్రులకు గతేడాది వారికి జన్మించిన బాలుడు ఎవరికి రాని విధంగా తోకతో జన్మించాడు. తల్లిదండ్రులు ఏదో అలా జరిగి ఉండవచ్చులే అని లైట్ తీసుకున్నారు. కానీ అది కాలక్రమేణా పెద్ధదిగా పెరగడం స్టార్ట్ అయింది. దీంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని సూచించారు. ఓకే అని ఆ బాలుడి పేరెంట్స్ అనడంతో శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి ఉన్న తోకను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన బీబీనగర్‌లో జరిగింది.
ఇక అసలు వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ మహానగరంలో గతేడాది ఓ మహిళ అక్టోబర్ నెలలో పండంటి బాలుడికి జన్మనిచ్చింది. అయితే అందరి లాగా ఆ బాలుడు జన్మించలేదు. ఆ బాలుడు తోకతో జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మూడునెలలు తరువాత ఆ తోక అలాగే ఉండకుండా అది కాస్త 15 సెంటీమీటర్లకు పెరిగింది. దీంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో బీబీనగర్‌లోని దవాఖానకు తీసుకెళ్లి వైద్యులకు చూపించగా ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు వెన్నముకలోని ఐదు వెన్నుపూసలతో లింక్‌గా ఏర్పడి ఆ బాలుడికి తోక బయటకు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం డాక్టర్లు తోక నాడీ వ్యవస్థలో లింక్ అయి ఉండటంతో ఆపరేషన్ చాలా కష్టతరంగా మారిందని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు.
Also Read: కేటీఆర్ ఆర్థిక సాయం..దహనసంస్కారాలకు రూ.50 వేలు సాయం
ఇలాంటి శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆ బాలుడి నాడీ వ్యవస్థకు లింక్ ఉండటంతో నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఉండనుందని బాలుడు పెరిగే కొద్ది తన నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఉండనుందని వైద్యులు తెలిపారు. దీంతో అయినా సరే ఆ బాలుడి తల్లిదండ్రులు ధైర్యం చేసి ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరారు. దీంతో ఆ బాలుడికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపరేషన్ చేసే సమయంలో ఆ బాలుడికి ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని అంతేకాదు శస్త్రచికిత్స జరిగిన బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా రేర్‌గా జరుగుతాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు.