EPAPER

Telangana Congress Victory | కాంగ్రెస్ వెంటే ఎస్టీ, ఎస్సీ వర్గాలు.. కేసీఆర్ వైఖరే కారణం!

Telangana Congress Victory | ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు తమ అంతిమ తీర్పును చెప్పేశారు. 3 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ ఓటర్లు.. మెజారిటీ స్ధానాలతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరులో కాంగ్రెస్ పార్టీ దుమ్ముదులిపింది. ఆది నుంచి బీఆర్ఎస్ వెనుకంజలోనే కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటింది. బీఆర్ఎస్ కంటే డబల్ స్ధానాల్లో గెలుపొంది కారు స్పీడ్‌కు సడెన్ బ్రేకులు వేసింది.

Telangana Congress Victory | కాంగ్రెస్ వెంటే ఎస్టీ, ఎస్సీ వర్గాలు.. కేసీఆర్ వైఖరే కారణం!

Telangana Congress Victory | ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు తమ అంతిమ తీర్పును చెప్పేశారు. 3 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ ఓటర్లు.. మెజారిటీ స్ధానాలతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరులో కాంగ్రెస్ పార్టీ దుమ్ముదులిపింది. ఆది నుంచి బీఆర్ఎస్ వెనుకంజలోనే కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటింది. బీఆర్ఎస్ కంటే డబల్ స్ధానాల్లో గెలుపొంది కారు స్పీడ్‌కు సడెన్ బ్రేకులు వేసింది.


రాష్ట్రంలో ఉన్న మొత్తం రిజర్వడ్ సీట్లలో కాంగ్రెస్ మార్క్‌ స్ధానాలకు కైవసం చేసుకుని హస్తానికి తిరుగులేదని నిరూపించింది. 19 ఎస్సీ నియోజకవర్గాలున్న ఎస్సీ సీట్లలో కాంగ్రెస్‌13 చోట్ల గెలుపొంది, ఎస్సీలు తమ వెంటే ఉన్నారని మరోసారి రుజువుచేసింది. ఇక్కడ బీఆర్ఎస్ 6స్ధానాలతో సరిపెట్టికుంది.

దాంతోపాటు ఎస్టీ నియోజవర్గాల్లోను కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచింది. 12 స్థానాలున్న ఎస్టీ నియోజవర్గాల్లో 9సీట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని బీఆర్ఎస్ సీట్లకు గండికొట్టింది. బీఆర్ఎస్ కేవలం 3 స్దానాలకు పరిమితమయింది. బీజేపీ పార్టీ అయితే రిజర్వడ్ స్ధానాల్లో ఎక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది.


అయితే ఓవరాల్‌గా చూసుకుంటే దళితులు, గిరిజనులు తొలినుంచీ కాంగ్రెస్ వైపే ఉండగా.. 2014 రాష్ట్ర విభజన తర్వాత కొంతమేర దళితులు బీఆర్ఆస్, గిరిజనులు వైపు మొగ్గుచూపారు.
దాంతో బీఆర్ఎస్ కూడా రెండు పర్యాయాలు అధికారంలోకి రావడానికి ఈ నియోజకవర్గాలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎస్టీ,ఎస్సీ నియోజవర్గాల్లో మాత్రం పూర్తిగా దెబ్బపడిందని తెలుస్తోంది. ఈసారి బీఆర్ఎస్‌కు స్వస్థి చెప్పి..మరలా పూర్వం నుంచి కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న ఆ సామాజివ వర్గాలు కాంగ్రెస్‌కే తిగిరి జై కొట్టాయి. దీంతో ఓవరాల్‌గా 19 స్ధానాలున్న ఎస్సీ నియోజకవర్గాల్లో 13 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది.
12 స్థానాలున్న ఎస్టీ నియోజకవర్గాల్లో 9సీట్లలో కాంగ్రెస్ గెలుపు జెండా ఎగురేసింది.

బీఆర్ఎస్ రిజర్వడ్ స్ధానాల్లో ఓడిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు బలంగా పనిచేసాయని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా దళితుల విషయంలో దళిత బంధులో భారీగా అవినీతిగా జరిగిందని ఆరోపణలు బలంగా వినిపించాయి. దళిత బంధు అందడం లేదని లబ్దిదారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అనేక ప్రాంతాల్లో బహిరంగగానే కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని దళితులు నిరసన గళం వినిపించారు. కేవలం తమ సొంతవారికి, పార్టీలో తిరిగిన వారికి దళిత బంధును ఇస్తున్నారు తప్ప..నిజమైన లబ్ధిదారులకు పధకం అమలు కాలేదని వారి వాదన.

చాలాచోట్ల దళితబంధు ఇప్పిస్తామంటూ స్థానిక నేతలు కమీషన్లు కూడా తీసుకున్నారు. ఈ విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోయింది. ఏకంగా స్వయంగా సీఎం కేసీఆరే దళితబంధులో అవినీతి జరుగుతోందని ఒప్పుకున్నారు. దీంతో ఈ విషయాలన్ని ఈ ఎన్నికల్లో రిజర్వడ్ స్ధానాల్లో బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులుగా నిలిచాయి. దళితులెవరూ కేసీఆర్ మాటలను నమ్మక పోవడం..పైగా దళిత బంధు వైఫల్యం చెందడం.. బీఆర్ఎస్‌ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఇక ఎస్టీల విషయాల్లో అయితే బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలకు ఎక్కడా నిలబెట్టుకోకపోవడంతోనే బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వినిపించే కేసీఆర్ వాగ్దానం గిరిజనులకు 10% రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తానడం. ఆదివాసీ-గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల జీవో అంశంతో పాటు ..త్వరలో గిరిజనబంధు కూడా తెస్తామని వ్యాఖ్యానించారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ల గురించి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతోనే ఆదివాసీ, గిరిజన యువకుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. దీని ద్వారా ఉద్యోగుల సైతం పొందచ్చని ఆదివాసీ, గిరిజన యువత భావించారు. దీనిపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ దిశగా కేసీఆర్ ఎక్కడా నిర్ణయాలు తీసుకోకపోవడం..అంతకముందు ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికల్లో ఎస్టీ నియెజవర్గాల్లో గట్టి షాక్ తగిలింది.

ఇక బీజేపీ ఎస్టీ నియోజకవర్గంలో ఖాతా తెరవకపోవడానికి ఈ అంశం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశంలో కేసీఆర్ బాల్‌ను కేంద్ర బీజేపీ కోర్టులో వేసేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేస్తుందని ప్రకటన ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రమే ఈ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ఇంపాక్ట్ బీజేపీ పడి…కమలం పార్టీ కూడా ఎస్టీ స్ధానాల్లో ఖాతా తెరవకపోవడానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×