EPAPER
Kirrak Couples Episode 1

DH: ఒక్కసారి కాదు, వందసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కుతా.. డీహెచ్ తగ్గేదేలే!

DH: ఒక్కసారి కాదు, వందసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కుతా.. డీహెచ్ తగ్గేదేలే!

DH: పదవుల కోసం పాకులాటో.. రాజకీయ ఉబలాటమో.. కారణమేదైనా కొందరు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. గతంలో మెదక్ జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ముఖ్యమంత్రి కాళ్లపై పడటం.. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావడం తెలిసిందే. లేటెస్ట్ గా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సైతం ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కడం కాంట్రవర్సీగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీనివాసరావు ట్రై చేస్తున్నారని.. అందుకే కాళ్లు మొక్కారంటూ డీహెచ్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు సైతం డీహెచ్ ప్రవర్తనను తప్పుబట్టారు.


ఇటీవల మెడికల్ కాలేజెస్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిందీ ఘటన. ఆ కార్యక్రమంలో డీహెచ్ శ్రీనివాసరావు రెండుసార్లు సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కారు. కాళ్లు మొక్కడానికి ముందు ముఖ్యమంత్రి చేతికి ఓ లెటర్ లాంటిది ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఘటనపై తాజాగా డీహెచ్ శ్రీనివాసరావు స్పందించారు. కాళ్లు మొక్కడంలో తగ్గేదేలే అన్నట్టు మాట్లాడారు.

ఒక్కసారి కాదు.. వందసార్లు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కుతానని చెప్పారు డీహెచ్. సీఎం కేసీఆర్‌ తనకు పితృ సమానులని.. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనా దక్షుడని.. ముఖ్యమంత్రి పాదాలు తాకడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడాన్ని కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కాళ్లు మొక్కితే ఎమ్మెల్యే అయిపోతారా? ఎమ్మెల్యే కావడానికి కొన్ని అర్హతలు ఉండాలంటూ రివర్స్ కౌంటర్ వేశారు.


డీహెచ్ వ్యాఖ్యలపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కావాలంటే వ్యక్తిగత హోదాలో ఎన్నిసార్లైనా కాళ్లు మొక్కుకోవచ్చు గానీ.. ఉన్నతాధికారిగా ఉండి ఇలా కాళ్లపై పడటం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. వెంకటరమణారెడ్డిలానే శ్రీనివాసరావు సైతం ఏదో రాజకీయ పదవి ఆశించే ఇలా కాళ్లు మొక్కుడు ప్రోగ్రామ్ పెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.

Tags

Related News

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Big Stories

×