EPAPER

Attack On Big Tv Team : బిగ్ టీవీ సిబ్బందిపై గచ్చిబౌలి స్టేడియంలో దౌర్జన్యం… ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు

Attack On Big Tv Team : బిగ్ టీవీ సిబ్బందిపై గచ్చిబౌలి స్టేడియంలో దౌర్జన్యం… ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు

Attack On Big Tv Team : సాక్షాత్తు సీఎం రేవంత్ ఆదేశాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతోంది. అసలు హైదరాబాద్ మహానగరంలోనే సీఎం మాటకు అధికారులు ఎందుకు విలువ లేనట్లు ప్రవర్తిస్తున్నారు. కావాలనే ప్రభుత్వాధినేత మాటను నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న ధోరణని అధికారులు అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది.


లైవ్ కన్సర్ట్…

ఈనెల 19న గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ లైవ్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన టికెట్ల‌ను ఇప్ప‌టికే విక్ర‌యించారు కూడా.


అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్…

ఇక సదరు ఈవెంట్ నిర్వహించేందుకు స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు. స్టేజీ కోసం స్టేడియంలో భారీగా గుంతలు సైతం తవ్వారు. స్టేడియం అంతా పాడవుతుందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధులపైన అక్కడి సిబ్బంది దౌర్జన్యం చేశారు. అక్కడ ఏం జరుగుతుందో, ట్రాక్ ను ఏం చేస్తున్నారో చూద్దామనుకున్న బీగ్ టీవీ జర్నలిస్టులతో అమర్యాదకరంగా ప్రవర్తించారు.

స్టేడియాల్లో వద్దని చెప్పిన సీఎం…

గతంలోనే ఆటలు ఆడే స్థలంలో ఈవెంట్స్ నిర్వహించకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆయన మాట పట్టించుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ ఇవెంట్‌కు అనుమతి ఇచ్చారు. అక్కడ అంతా తవ్వేస్తున్నారు. అది కవర్ చేయడానికి వెళ్లిన బిగ్ టీవీ సిబ్బందిపై దాడి చేశారు.

రూ.20 కోట్ల భారీ ఖర్చు…

ఇక ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియాన్ని ఈమధ్యే దాదాపుగా రూ.20 కోట్ల భారీ ఖర్చుతో మరమ్మతులు చేపట్టారు. అయితే క్రీడా మైదానాలను కేవలం క్రీడలకే వాడాకోవాలని, ఇతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ కోసం ఇవ్వకూడదని సీఎం స్వయంగా శాట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న తీరుతో గచ్చిబౌలీ స్టేడియం ఈవెంట్ కోసం రెఢీ అవుతోంది.

డీఎస్పీ సూపర్ మ్యూజిక్…

తెలుగు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, టాప్ హీరోలతో ఆయన ఇప్పటికీ వందలాది మెలోడీస్, సూపర్ హిట్ టైటిల్ సాంగ్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్, తొలిసారిగా ఓ లైవ్ కన్సర్ట్ ను హైదరాబాద్’లోనే నిర్వహించబోతున్నాడు. ఈ నెల 19న ఈ మ్యూజిక‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.

ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల‌ను మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిసి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానాన్ని సైతం అందజేశారు. కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సైతం వెళ్లిన డీఎస్పీ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు.  ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్ల కోసం క్రికెట్ స్టేడియాలు, ఇతర స్టేడియాలు కాకుండా బహిరంగ స్థలాలు, ఓపెన్ ప్లేసెస్, సిటీకి దూరంగా శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని క్రీడాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తే గానీ తమ స్టేడియాలు రిపేర్లు కావని, అలాంటి సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.20 కోట్ల ఖర్చుతో పెద్ద ఎత్తున స్టేడియానికి మరమ్మతులు చేయించి కొత్త సొబగులు అద్దారని అంటున్నారు. క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన స్టేడియాలు, మైదానాలు ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే వాటి నాణ్యత దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు.

Also Read : కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

Related News

Minister Seethakka : అప్పుల అప్పారావు లెక్కలెన్నో..! – మంత్రి సీతక్క

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

BRS MLAs meeting: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

IAS Lunch Motion: ఐఏఎస్‌ల్లో టెన్షన్.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది?

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Big Stories

×