EPAPER

Lok Sabha Elections 2024 : ఎవరెవరు ఎన్ని సభలలో పాల్గొన్నారంటే.. ?

Lok Sabha Elections 2024 : ఎవరెవరు ఎన్ని సభలలో పాల్గొన్నారంటే.. ?

Loksabha election live updates(Political news telugu): నేటి సాయంత్రంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి పార్టీలు, నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు తమ ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాయి.


ఈ సందర్భంగా నేతలు ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో ఆసక్తి రేకించారు. తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు పార్లమెంటు ఎన్నికల్లో బిజీబిజీగా గడిపారు. రోజుకు రెండు నుంచి మూడు, లేదా నాలుగు ఇలా ఎన్ని వీలైతే అన్ని సభలల్లో పాల్గని ప్రసంగించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొంటూ నిత్యం జనం మధ్యే కనిపించారు. బస్సు యాత్రలు నిర్వహించారు.

ఢిల్లీకి చెందిన ముఖ్య నేతలు కూడా రాష్ట్రంలో పలు దఫాలుగా పర్యటించి బిజీబిజీగా గడిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కూడా తెలంగాణ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇతర రాష్ట్రాల నేతల సందడి బాగా కనిపించింది. సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొంటూ తమ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.


మొదటగా కాంగ్రెస్ విషయానికి వస్తే, ఈసారి కేంద్రంలోకి అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. జనజాతర సభలు నిర్వహించింది. అగ్ర నేతలు మల్లికార్జున ఖరే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు దాదాపు అన్ని నియోజకవర్గాలలో వారు పాల్గొని ప్రసంగించారు. అధికంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించి సభలలో పాల్గొని ప్రసంగించారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా పలు దఫాలుగా రాష్ట్ర పర్యటన చేసి తమ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రసంగాలు చేశారు.

ఆ ప్రసంగాలలో తమకు ఎందుకు ఓటు వేయాలి? పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది..? ఏం చేయలేదు..? మూడోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతది..? భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..? అనే అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను తమ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పని చేసిన మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం 27 రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి 57 సభలలో పాల్గొన్నారు. అదేవిధంగా రోడ్ షోలు, కార్నర్ షోలు నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించారు.

రోజుకు రెండు బహిరంగ సభలలో పాల్గొని, ఆ తరువాత రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలపై ఆయన పదునైన విమర్శలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తాము అధికారంలోకి వచ్చాక ఏ విధంగా పారిపాలన చేశాం..? భవిష్యత్తులో పరిపాలన ఎలా ఉండబోతుంది..? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదేళ్లపాటు ఏం చేసింది..? తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చింది..? ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై ఆయన విమర్శలు కురిపించారు. ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా తనదైన శైలీలో విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు పలు సందర్భాల్లో సవాళ్లను విసిరారు. ఈ నేపథ్యంలో సవాళ్ల అంశం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా తాము భవిష్యత్తులో చేయబోయే రైతు రుణమాఫీ వంటి పలు హామీలకు సంబంధించి సభలలో ఆయన ప్రస్తావించారు. మొత్తం తన పర్యటనలు, ప్రసంగాలతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఇటు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రంలో పర్యటించారు. బస్సు యాత్ర చేపట్టి మొత్తం 16 రోజులపాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. బహిరంగ సభలలో ఆయన పాల్గొని కేంద్రంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు.

మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు కూడా ఈ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు. 16 లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించిన కేటీఆర్ 82 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. హరీశ్ రావు కూడా 16 నియోజకవర్గాల్లో పర్యటించి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. పలు సందర్భాల్లో హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది.

బీజేపీ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూలేనంతగా ఈసారి ఎక్కువ ఫోకస్ చేసింది. దక్షిణా రాష్ట్రాల్లో ఎక్కువగా సీట్లు సంపాదించాలన్న కోణంలో బీజేపీ సభలు, సమావేశాలు, ర్యాలీలు భారీగా నిర్వహించింది. ప్రధాని మోదీ, అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు, మాజీ గవర్నర్ తమిళి సై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతోపాటు పలువురు నేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలైతే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.

ఇగ ఇతర పార్టీలు, ఇండిపెండింట్ అభ్యర్థులు కూడా భారీగా తమ తమ నియోజకవర్గ పరిధిలలో పర్యటించి విస్తృతంగా పర్యటించారు. చూడాలి మరీ ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించుకుంటుంది అనేది.

Also Read: జగన్‌కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి

కాగా, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్ జరగనున్నది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మిగతా సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నది.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×