EPAPER

Deputy CM Mallu Bhatti Vikramarka: ఆగస్టు చివరిలోగా రూ.31వేల కోట్లు విడుదల..బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం

Deputy CM Mallu Bhatti Vikramarka: ఆగస్టు చివరిలోగా రూ.31వేల కోట్లు విడుదల..బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం

Deputy CM Mallu Bhatti Vikramarka About Farmer loans: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణమాఫీ విషయంపై ప్రజా భవన్‌లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా రుణమాఫీపై చర్చించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకి మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులను మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించారు.


ఆగస్టు చివరిలోగా రూ.31వేల కోట్లు నిధులు విడుదల చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. కేవలం రైతు రుణమాఫీకి రూ.31వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు తదితరులు హాజరయ్యారు.

ఆగస్టు చివరిలోగా రెండో దఫా రూ.లక్షన్నర ఉన్న రుణా మాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రూ.2లక్షలపైన రుణం ఉన్న రైతులతో మాట్లాడి రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలో చారిత్రక నిర్ణయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలోనే మాఫీ చేసిందన్నారు.


Also Read: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, కొత్త ఛైర్మన్ కోసం..

ఇదిలా ఉండగా, రుణమాఫీని పండుగలా నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×