EPAPER

Deputy CM Bhatti: తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. ఆ రోజే మూడో విడత రుణమాఫీ

Deputy CM Bhatti: తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. ఆ రోజే మూడో విడత రుణమాఫీ

Deputy CM Bhatti: రాష్ట్ర రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో శుభవార్త చెప్పారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామంటూ ఆయన తెలియజేశారు. ఖమ్మంలోని వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పాల్గొననున్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణమాఫీ జరగనున్నదన్నారు. ఇది రైతుల అదృష్టమంటూ భట్టి పేర్కొన్నారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండిపోయారన్నారు. రుణమాఫీ చేసి ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో పడేశామన్నారు.


Deputy CM Bhatti
Deputy CM Bhatti

జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని తెలియజేసిన డిప్యూటీ సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం మొదటి దఫా రైతు రుణమాఫీ చేశామంటూ ఆయన స్పష్టం చేశారు. లక్షన్నర రూపాయల రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు వేశామన్నారు. మొత్తం 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ధి చేకూరిందన్నారు. రెండు దఫాలు కలిపి రూ. 12,289 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో రుణమాఫీనే కాదు, రైతు భీమాకు సంబంధించిన నిధులను కూడా పెట్టామంటూ ఆయన తెలిపారు.

Also Read: రాఖీ పండుగ నేపథ్యంలో కవిత బెయిల్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..


మరోవైపు రైతుల ప్రీమియంను సైతం వైరా సభలోనే ప్రకటిస్తామని భట్టి పేర్కొన్నారు. దీని ద్వారా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రూ.1350 కోట్లను రైతు పంటల భీమాను రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. రూ. 72 వేల కోట్లను రైతు అనుబంధం ఉన్నవారికి కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×