EPAPER
Kirrak Couples Episode 1

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

సంగారెడ్డి, స్వేచ్ఛ: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే, ఏకంగా చెరువులోనే 5 అంతస్తుల భవనం కట్టేశారు. గురువారం దీనిని కూల్చివేశారు అధికారులు.


భవనంపైకి వెళ్లేందుకు ప్రత్యేక మెట్ల మార్గం

Also Read: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్


మల్కాపూర్‌కు దగ్గరలో పెద్ద చెరువు ఉంటుంది. దానికి ఆనుకుని 5 అంతస్తుల అక్రమ నిర్మాణం జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గ్రామానికి చేరుకుని చెరువులోనే ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. దీనికోసం డిటోనేటర్లను వాడారు. హైదరాబాద్‌కు చెందిన నర్సింహులు ఈ భవనానికి ఓనర్‌గా గుర్తించారు. నీటిలో అడుగు పెట్టకుండా భవనంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గాన్ని నిర్మించారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరేవారని గ్రామస్తులు తెలిపారు.

కూల్చివేతలో అపశృతి

చెరువులో బహుళ అంతస్తుల భవనం ఉండడంతో అధికారులు బాంబులు అమర్చి కూల్చివేశారు. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడ్డాయి. అవి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Also Read: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

పట్టా భూమి అంటేనే కొన్నా – భవనం ఓనర్

మల్కాపూర్ చెరువులో బిల్డింగ్ కట్టిన నర్సింహులతో ‘స్వేచ్ఛ’ మాట్లాడింది. ఈ సందర్భంగా కీలక విషయాలు తెలిపాడు. 2011లో తాను మూడెకరాల భూమిని తీసుకున్నానని చెప్పాడు. 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టానని, తాను కొన్నప్పుడు పట్టా భూమి అనే అమ్మారని వివరించాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళితే అధికారులు ఎక్కడా కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పలేదని వాపోయాడు. తానిప్పుడు 6 కోట్ల రూపాయలు నష్టపోయానని చెప్పారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవనం కట్టిన 12 ఏళ్ల తర్వాత కూల్చడం దారుణమని వాపోయాడు.

Related News

Bhatti Vikramarka: కొత్త లుక్‌లో భట్టి విక్రమార్క… ప్యాంట్, షూట్‌ వేసి అమెరికాలో హల్చల్

CM Revanth: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్

KTR: బిగ్ షాక్.. చిక్కుల్లో మాజీ మంత్రి కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?

Digital Health Cards: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

DJ Sounds: డీజేలు వాడుతున్నారా..? టపాసులు పేలుస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..

Big Stories

×