EPAPER
Kirrak Couples Episode 1

Dcm Mallu Bhatti Vikramarka : ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఏంటో మా పాలనతో చూపిస్తాం

Dcm Mallu Bhatti Vikramarka : ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఏంటో మా పాలనతో చూపిస్తాం

– అభివృద్ధి, స్వేచ్ఛ లక్ష్యాలతో పనిచేస్తున్నాం
– హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్​
– పేదల పేరుతో బిల్డర్ల అక్రమాలకు చెక్ పెడతాం
– మూసీనదికి పునర్వైభవం తెచ్చి తీరుతాం
– మీ మేధస్సు తెలుగువారికి ఉపయోగపడాలి
– యూఎస్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం


హైదరాబాద్, స్వేచ్ఛ : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసిన ఏకపక్ష, నియంతృత్వ పాలనకు భిన్నంగా పూర్తి ప్రజాస్వామికమైన పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన జరుగుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తన అధికారిక విదేశీ పర్యటనలో భాగం గా ఆదివారం సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని, అమెరికాలోని తెలుగువారి మేథస్సు ఉభయ తెలుగు రాష్ట్రాల వికాసానికి దోహదపడాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.


రాక్స్, లేక్స్, పార్క్​లు

హైదరాబాద్ అంటే ఒకప్పుడు రాక్స్, లేక్స్, పార్క్‌లు గుర్తుకొచ్చేవని, మారిన పరిస్థితుల్లో అవన్నీ మాయమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలోనే తెలంగాణలో వందల చెరువులు మాయమయ్యాయని, పట్టణ, నగర ప్రాంతాల్లో నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని, ఇకనైనా ఆ పని ఆపకపోతే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడకతప్పదన్నారు.

హైదరాబాద్‌లోని లేక్స్ మాయమైతే, ఇటీవల వరదల ధాటికి విజయవాడ ఎలా విలవిలలాడిందో అలాంటి పరిస్థితే వస్తుందని వివరించారు. జలవనరుల సంరక్షణ, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తులను సంరక్షించటం తాము చేస్తున్న ప్రయత్నాలను కొందరు రాజకీయం చేయటం దురదృష్టకరమన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టి, ఆ నదికి తిరిగి పునరుజ్జీవాన్ని తేవటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

పేదల పేరుతో బిల్డర్ల దందా

పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ధన, ప్రాణ, ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగా చెరువులను రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపటినట్లు చెప్పారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వాటిని వినియోగిస్తామన్నారు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అందుకే హైడ్రా..

హైదరాబాద్‌లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు పేదలను అడ్డుపెట్టుకుని భవన నిర్మాణాలు చేస్తున్నారని, హైడ్రా దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, పేదలను తెరమీదికి తీసుకొచ్చి నానా యాగీ చేస్తు్న్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు, ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగానే హైడ్రా తన పని తాను చేస్తోందన్నారు. చెరువులను రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించటం అందరి భాధ్యత అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వాటిని వినియోగిస్తామన్నారు.

Also Read : మళ్లీ షురూ… హైదరాబాద్ మహానగరంలో వర్షం

మూసీ పునరుజ్జీవం

మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి, పునరావాస చర్యలు చేపడుతున్నామన్నారు. వారంతా మంచి వాతావరణంలో బతికేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తున్నామని, దీనిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Women Welfare: మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. వైద్యశాలల సంఖ్య పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్‌లో పడొద్దు

Hydra: మీ ఇల్లు చెరువుల పరిధిలో ఉందా ? ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Rains: హైదరాబాదులో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Big Stories

×