EPAPER

Kavitha: మీ ఇంటికొస్తాం.. కవిత విచారణకు డేట్ ఫిక్స్ చేసిన సీబీఐ..

Kavitha: మీ ఇంటికొస్తాం.. కవిత విచారణకు డేట్ ఫిక్స్ చేసిన సీబీఐ..

Kavitha: 6న వస్తానని.. ఆ తర్వాత రాలేనన్నారు. సీబీఐ చెప్పిన డేట్ నాడు తనకు కుదరదని చెప్పారు. 11, 12, 14, 15 తేదీలైతే ఓకే అన్నారు కవిత. సరే, అలానే కానిద్దాం. మీరు చెప్పినట్టుగానే డిసెంబర్ 11న మిమ్మల్ని మీ ఇంట్లోనే విచారిస్తాం.. ఉదయం 11 గంటలకు వస్తాం.. అంటూ కవితకు ఈ-మెయిల్ లో సమాచారం అందించింది సీబీఐ. దీంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పీక్స్ కు చేరింది.


ఈ నెల 6నే కవిత వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది సీబీఐ. అందుకు ముందు ఓకే అన్న కవిత.. ఆ తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపాక.. తనకు నాట్ ఓకే అంటూ సీబీఐకు లేఖ రాశారు. ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు కవిత. స్పందించిన సీబీఐ అధికారులు వెబ్ సైట్ లో ఉంది చూసుకోమంటూ మెయిల్లో కవితకు రిప్లై ఇచ్చారు.

కట్ చేస్తే.. ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని.. 6వ తేదీన తాను బిజీగా ఉన్నానని.. 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్లోని తన ఇంట్లో అందుబాటులో ఉంటానంటూ సీబీఐకు మళ్లీ మెయిల్ చేశారు కవిత. ఆ మెయిల్ కు ఇప్పుడు సీబీఐ రిప్లై ఇచ్చింది. కవిత చెప్పినట్టే 11న వాంగ్మూలం తీసుకునేందుకు ఉదయం 11 గంటలకు ఇంటికి వస్తామంటూ సీబీఐ అధికారులు తెలిపారు.
కవితను సీబీఐ విచారించనుండటం తెలంగాణలో రాజకీయ వేడి రగిలిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఊదరగొడుతున్నారు. వాళ్ల మాటలే నిజమైతే.. ఈ కేసులో కవితను వాంగ్మూలంతోనే సరిపెడతారా? అరెస్ట్ కూడా చేస్తారా? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు.. కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరునూ రిమాండ్ రిపోర్టులో చేర్చింది సీబీఐ. అయితే, మాగుంట విచారణపై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు.. కవిత విషయంలో మాత్రం సీబీఐ దూకుడుగా వ్యవహరించడం వెనుక రాజకీయ కోణం ఉందనేది టీఆర్ఎస్ ఆరోపణ. నిజానిజాలు ఎలా ఉన్నా.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు రావడం మాత్రం.. ఆమె ఇమేజ్ కు, అధికార పార్టీకి భారీ డ్యామేజే అంటున్నారు. మరి, విచారణలో కవిత ప్రమేయంపై క్లారిటీ వస్తే.. ఈ కేసులో మరింత ఉచ్చు బిగిసే అవకాశం కూడా లేకపోలేదు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×