EPAPER

CM Revanth Reddy: మా ఊరి బిడ్డ వస్తున్నాడయ్యా.. దసరాకు స్వగ్రామానికి వెళుతున్న సీఎం రేవంత్.. గ్రాండ్ వెల్ కమ్ కి అంతా సిద్దం

CM Revanth Reddy: మా ఊరి బిడ్డ వస్తున్నాడయ్యా.. దసరాకు స్వగ్రామానికి వెళుతున్న సీఎం రేవంత్.. గ్రాండ్ వెల్ కమ్ కి అంతా సిద్దం

CM Revanth Dasara Celebrations: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి దసరా పండుగ ప్రత్యేక కానుకలు తీసుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి రానుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లతో పాటు గ్రామంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.


దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రానున్నారు. దీనితో కొండారెడ్డిపల్లితో పాటు వంగూరు మండలంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై అధికారులు దృష్టిసారించారు. వంగూరు మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొండారెడ్డిపల్లి అభివృద్ధి కోసమే దాదాపు రూ.50 కోట్లు మంజూరవగా వంగూరులో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు, వంగూరు నుంచి జూపల్లి వరకు బీటీ డబుల్ రోడ్డు, శ్రీశైలం నేషనల్ హైవే రాంనగర్ స్టేజీ నుంచి కొండారెడ్డిపల్లికి బీటీ రోడ్డు నిర్మాణం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం ప్రతిపాదనలను సీఎం కార్యాలయానికి పంపించారు.

గత నెల రోజుల నుండి పనులు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమైన పనులను పూర్తిచేసి గ్రామ స్వరూపాన్ని మార్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.. గ్రామంలో ప్రధానమైనటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని సుమారు 72 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మించారు..చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటుచేసి గ్రామపంచాయతీలో విలువైన సామాగ్రితో సుందరంగా తీర్చిదిద్దారు. భవనంలో అధికారులు కూర్చోవడానికి సమావేశాలు నిర్వహించడానికి హాల్ తో పాటు ప్రత్యేక వసతులు కల్పించారు.


సీఎం రాక సంధర్భంగా జడ్పీటీసీ స్థాయి నుండి తమ గ్రామ బిడ్డ సీఎం హోదాలో ఉండడం తమకెంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం దసరాకు ఇక్కడికి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి అందరితో సాధారణ వ్యక్తి లాగే ఉండేవారని ఈ దసరాకు సీఎం హోదాలో తమ గ్రామానికి వస్తుండడంతో ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు వారు. ప్రతి సంవత్సరం దసరా కన్నా ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహించి పండుగ జరుపుకుంటామన్నారు.

సీఎం స్వగ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు ఇవే
రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద కొండారెడ్డిపల్లిని పూర్తిస్థాయిలో సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామంలోని ప్రతి ఇంటికి, వ్యవసాయ మోటారు కనెక్షన్కు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఉచితంగా సోలార్ విద్యుత్ అందించనున్నారు. సోలార్ ద్వారా గృహ, వ్యవసాయ, వాణిజ్య అవసరాలకు వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్ ను విక్రయించి ఆదాయం పెంచుకునేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామంలోని మొత్తం 499 గృహ విద్యుత్ వినియోగదారులు, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి చేకూరనుంది. రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలోని ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణం కోసం రూ. 4 కోట్ల వరకు సొంత నిధులు కేటాయించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న పాత హనుమాన్ ఆలయాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy Emotional: భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్.. ఆ ఒక్క ట్వీట్ తో అందరినీ.. !

సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ ఆలయంలోనే పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు. ఆయన చెప్పినట్టుగానే భవిష్యత్తులో బీసీల ఎదుగుదలకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొదటగా తన గ్రామం నుండి మొదలుపెట్టేలా 65 లక్షల రూపాయలతో మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో సుందరమైన బీసీ భవనాన్ని నిర్మించారు. గ్రామానికి సంబంధించిన పెద్దలు ముఖ్యులు ఎవరు వచ్చినా కూర్చోవడానికి వీలుగా బీసీ భవనం చుట్టుపక్కల ప్రాంతమంతా సుందరంగా తయారు చేశారు. తమ గ్రామ బిడ్డ సీఎం అయ్యాక గ్రామం అభివృద్ధి పథం వైపు ముందుకు సాగడం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.

ఆపన్నహస్తం అందించిన సీఎం..
ముఖ్యంగా గ్రామంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని 55 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి సోల్జర్ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. దేశం కోసం కార్గిల్ లో ప్రాణాలర్పించిన యాదయ్య కుటుంబానికి ఉద్యోగంతో పాటు 5 ఎకరాల భూమిని ఇచ్చి దేశంపై తనకున్నటువంటి బాధ్యతలు చాటుకున్నారు. 2013లో తమ కుటుంబ సభ్యుడైన యాదయ్య చనిపోతే ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి ఎన్నో భరోసాలు ఇచ్చారు కానీ అవి చాలా సంవత్సరాలుగా నెరవేరలేదు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆరు నెలల్లోనే తమ కుటుంబ కష్టాలు తీర్చడం తమకెంతో ఆనందమని కుటుంబ సభ్యులు అంటున్నారు…

మొత్తానికి జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తుండగా.. తమ గ్రామం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుందని కొండారెడ్డి పల్లె గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరంలాగే దసరా పండగ రోజు తమ గ్రామానికి రేవంత్ రెడ్డి రానుండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కొండారెడ్డి పల్లె గ్రామస్తులు తెలిపారు.

Related News

Bathukamma: ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబరాలు

Vinod Kumar: భర్తీ మాది.. క్రెడిట్ మీకా.. ? ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఫైర్

KCR – Kavitha: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

Amrapali Kata IAS : ఆమ్రపాలికి కేంద్రం షాక్.. సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందే!

Konda Surekha : మంత్రి కొండా సురేఖను చుట్టుముడుతున్న కేసులు… అటు నాగార్జున, ఇటు కేటీఆర్

Konda Surekha: నాగార్జున కేసులో మంత్రి సురేఖకు నోటీసులు.. ఇక కేటీఆర్ కూడా.. ?

Big Stories

×