EPAPER

Danam Nagendar: కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నరు.. నీ కెపాసిటీ ఎంతో మాకు తెలుసు!

Danam Nagendar: కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నరు.. నీ కెపాసిటీ ఎంతో మాకు తెలుసు!

MLA Danam Nagendhar Sensational Comments: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నీ కెపాసిటీ ఎంతో మాకు తెలుని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ నివాసానికి వెళ్లిన దానం.. అక్కడే మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, ఆయనను ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.


కౌశిక్ రెడ్డి రెచ్చిపోయి గాంధీ ఇంటి మీద జెండా ఎగరవేస్తానని రెచ్చగొటే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నిర్ణయమా? లేదా కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు అయితే వెంటనే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు.

కాగా, కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని అరెకపూడి గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నారు. తనను బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు గాంధీ ఆహ్వానించడంతోనే వచ్చినట్లు, ఓ సహచర ఎమ్మెల్యేగా వెళ్లినట్లు దానం వెల్లడించారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌ను గాంధీ ఇంటికి వెళ్లేందుకు అనుమతించడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.


ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసరగా.. రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. మొదట కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరెకపూడి గాంధీ ఇంటిపై జెండా ఎగరవేస్తానని చెప్పడంతోనే గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇందులో భాగంగానే, దానం నాగేందర్ బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇళ్లే దొరికిందా? అన్నారు. గాంధీ నివాసంలో బీఆర్ఎస్ సమావేశం పేరిట ఆయనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్రనేతల అండతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చీర, గాజులు చూపించి వ్యాఖ్యలు చేయడం ఏంటని, మహిళలు త్వరలోనే కౌశిక్ రెడ్డికి తడాఖా చూపిస్తారన్నారు.

అంతకుముందు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోందని విమర్శలు చేశారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం సీనియర్లని దానం పేర్కొన్నారు. తాను కూడా హైదరాబాద్ వాడినని, ఒక్క పిలుపుతో బీఆర్ఎస్ లీడర్ల అందరి ఇళ్లను బ్లాక్ చేయగలమన్నారు.

Also Read: సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

ఈ విషయంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఇది బీఆర్ఎస్, గాంధీకి యుద్ధం కాదని వెల్లడించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానని సవాల్ విసిరి రాలేదని, అందుకే నేను వెళ్లానన్నారు. పార్టీ నాయకులు గుర్తించాలని, కావాలనే ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారన్నారు. ఇలాంటి నాయకులు పార్టీలో ఉంటే మరింత మంది బయటకు వెళ్లే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని, అతనికి, నాకు మాత్రమే యుద్ధమన్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×