EPAPER

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
Khammam Weather news

Khammam Weather news(Rain news today telangana):

మిగ్ జాం తుపాన్ పై అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను హాస్టల్ విడిచి బయటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని, అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744 241950 నబంర్ ను సంప్రదించాలిని చెప్పారు. ప్రజలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఇతర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు.


కలెక్టర్ ప్రియాంక ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం అత్యవసర సేవలకు మండల డివిజన్, జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అందరికీ అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగ సలహాలు, సూచనలను పాటించాలని ప్రజలను కోరారు.


Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×