EPAPER

Crop Loan Waiver: నేడే మూడో విడత రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు

Crop Loan Waiver: నేడే మూడో విడత రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు

Third Phase Rythu Runa Mafi Starts Today: రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నేడు ప్రారంభం కానుంది. మూడో విడతగా రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఈ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు.


ఈ వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మొదట రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కేటగిరీలో ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. దీంతో మూడు విడతల్లో సాగిన రుణమాఫీ ప్రక్రియ ముగియనుంది. మూడో విడతలో దాదాపు 14.45లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచానా వేస్తున్నారు.

ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు నెల రోజుల కిందట రుణమాఫీ ప్రక్రియను మూడు విడతలుగా ప్రారంభించారు. మొత్తం మూడు విడతల్లో సుమారు 32.50లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.


కాగా, జూలై 15వ తేదీన రుణమాఫీ జీఓను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా..అదే తేదిన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల వ్యవధిల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభించారు. జూలై 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలు ఉన్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు.

రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ జూలై 15 తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, జూలై 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలున్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు. 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. రూ.లక్ష నుంచి రూ. లక్షా50వేల వరకు ఉన్న రైతు కుంటుంబాలకు లోన్లను మాఫీ చేసింది. దాదాపు6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17,55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే

రుణమాఫీకి అర్హులై ఉండి సాంకేతిక సమస్య కారణంగా రుణమాఫీ కాని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సాంకేతిక సమస్య కారణంగా రుణమాఫీ రాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమించి సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెబుతున్నారు. రెండు విడతల్లో సాంకేతిక సమస్, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో కొంతమందికి రుణమాఫీ కాలేదని తుమ్మల గతంలో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×