Big Stories

Crime News: టర్కీ కోడి.. స్టేషన్లో పంచాయితీ.. ఏం జరిగిందంటే?

turkey cock

Crime News: అనగనగా ఒక టర్కీ కోడి.. దానిని అల్లారుముద్దుగా పెంచుకున్న యజమాని.. ఇక్కడివరకు బానే ఉంది. అయితే తన కోడి కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు కోడి ఓనర్. పొరుగు ఇంటివారే తన కోడిని మర్డర్ చేశారని పీఎస్‌లో కంప్లయింట్. చివరకు సెటిల్‌మెంట్‌తో ముగిసిన కోడి పంచాయితీ.

- Advertisement -

సీన్‌లోకే వెళ్తే కరీంనగర్ టౌన్‌లోని నాఖ చౌరస్తాలో నివాసముండే ఫాహాద్ ముబ్బషీర్ తన ఇంట్లో టర్కీ కోడిని పెంచుకుంటున్నాడు. ఏడాదిన్నరగా పెంచుకుంటున్న కోడి 2 రోజుల క్రితం కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ఇంటి ఎదుట ఉండే సాబీర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే సాబీర్ సమాధానం చెప్పేందుకు బుకాయించాడు. పోలీసులు ఊరుకుంటారా తమదైన విచారణలో కోడి మిస్సింగ్‌పై వివరాలు రాబట్టారు.

- Advertisement -

కోడిని ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా.. కోడి తరచూ తమ ఇంట్లోకి వస్తుందని జవాబు చెప్పాడు. రావడమే కాకుండా తమ పిల్లలపై దాడి చేస్తుందని పోలీసులకు వివరణ ఇచ్చాడు. నిజం తెలిసిన యజమాని తన కోడి ప్రాణాలతో లేదని తెలిసి ఖంగుతిన్నాడు. తన కోడిని చంపిన సాబీర్‌పై కేసు నమోదు చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇక టర్కీ కోడి మర్డర్ కేసు పోలీసులకు ఇరకాటంగా మారింది. చివరకు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే పోలీసులు సెటిల్‌మెంట్ చేసి పంపించి వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News