EPAPER

Demolitions: ఎవర్నీ వదలొద్దు..: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

Demolitions: ఎవర్నీ వదలొద్దు..: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

– కబ్జాలకు పాల్పడింది ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే
– కానీ, సామాన్యుల గురించి ఆలోచించాలి
– రంగనాథ్‌కు స్పీడ్ ఎక్కువ.. అది కూడా మంచిది కాదు
– వంద ఆక్రమణలు కూల్చి ఒక్కరిని వదిలిపెట్టినా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది
– నిర్ధిష్టమైన ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్లాలన్న కూనంనేని


HYDRA: అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా ముందుకెళ్తోంది హైడ్రా. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైడ్రా భయానక పేరు, జనం గుండెల్లో దడ పుట్టిస్తోందన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్లాలని సూచించారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడం సరైన నిర్ణయమేనని, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒవైసీలతో పాటు ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అయితే, ఎప్పుడు ఎవరిది కూలూస్తారో తెలియక చిన్నచిన్న వాళ్లు భయపడుతున్నారని, అసలు హైదారాబాద్‌లో కబ్జాకు గురైన భూమి ఎంత అని అడిగారు.

ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం, కబ్జా చేసిన పేద, మధ్య తరగతి ప్రజలకు పునరావాసం కల్పించే వరకు వాళ్ల జోలికి వెళ్ళకూడదని సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్స్ చేసి అమ్మిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. చెరువుల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను మరొక చోటకు మార్చాలని, వంద ఆక్రమణలు కూల్చి ఒక్కరిని వదిలిపెట్టినా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు కూనంనేని.


Also Read: Smart Cities: ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రం ఆమోదం.. ఇక ఉద్యోగాల జాతరే

‘‘రంగనాథ్‌కు స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్ కూడా మంచిది కాదు. దమ్ముంటే పాతబస్తీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నేతలు సవాళ్ళు చేసుకుంటున్నారు. కవిత బెయిల్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. మహిళ అని చూడకుండా అవమానిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతాయని ఒకరు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోతున్నాయని మరొకరూ ఆరోపణలు చేసుకుంటున్నారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు రుణమాఫీ చేయాలి. చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయమంటే ఎలా? మంత్రులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. సెప్టెంబర్ 17 ముస్లింలకు వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను గుర్తించి, అధికారికంగా నిర్వహించాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ విగ్రహాలను పెట్టాలి. పాఠ్య పుస్తకాల్లో వారి చరిత్రను చేర్చాలి. సెప్టెంబర్ 17కు ఆర్ఎస్ఎస్‌కు సంబంధం లేదు’’ అని అన్నారు కూనంనేని సాంబశివరావు.

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×