EPAPER

Constable Training: ఫిబ్రవరి 21 నుంచి కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌ .. వారికి మాత్రం శిక్షణ వాయిదా!

Constable Training: ఫిబ్రవరి 21 నుంచి కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌ .. వారికి మాత్రం శిక్షణ వాయిదా!

Constable training will start from February 21: తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు దాదాపు 28 కేంద్రాల్లో ఈ ట్రైనింగ్ జరగనుంది. రాజాబహదూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీ, పోలీస్‌ శిక్షణ కళాశాలలు (PTC), జిల్లా శిక్షణ కేంద్రాలు (DTC), నగర శిక్షణ కేంద్రాలతో పాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, ఈ ట్రైనింగ్‌కు సిద్ధమవుతున్నాయి.


సివిల్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, ఏఆర్‌, టీఎస్ఎప్‌పీ మొదలైన పలు విభాగాల్లో ఈ ట్రైనింగ్‌ ఇవ్వనుంన్నారు. ఇందులో మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. అయితే టీఎస్‌ఎస్‌పీ విభాగంలో ఇంకా 5,010 మందికి మాత్రం ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11వేల మందికి సరిపడ వసతులు ఉండటంతో వారిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు.

Read More: మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య.. ఏం జరిగింది?


మరో రెండు రోజుల్లో వాయిదా వేసిన వారికి శిక్షణలు ప్రారంభించాలని.. కేంద్రాల ప్రిన్సిపాళ్ల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో సీఆర్పీఎస్‌, ఏపీ, కర్ణాటక పోలీసుశాఖలకు తెలంగాణ శిక్షణ విభాగం కేంద్రాల్లో అనుమతి కోరుతూ లేఖలు రాసింది. అనుమతులు వస్తే అక్కడ కూడా ప్రారంభించే యోచనలో ఉనట్లు తెలుస్తుంది.

అనుమతులు లభించకపోతే ఇతర కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయ్యే వరకు అంటే దాదాపు 9నెలల వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం 500 మందికిపైగా ఎస్సైలతో పాటు, మరో 653మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు మేడ్చల్‌లో 400 మంది, వరంగల్‌లో 1000 మంది పీటీసీలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×