MLA Raja Singh: దీపావళి పండుగను పురస్కరించుకుని ఎమ్మేల్యే రాజాసింగ్ ఓ ప్రకటనతో హెచ్చరిక జారీ చేశారు. అలా చేసి.. మన దేవుళ్లను మన దేవుళ్లను మనం అప్రతిష్ట పాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని రాజాసింగ్ కోరారు. దీపావళి రోజు రాజా సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకు రాజాసింగ్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్ అంటే తెలియని వారు ఉండరు. హిందుత్వ వాదిగా గుర్తింపు పొందిన రాజాసింగ్ నిరంతరం తన వాదాన్ని వినిపిస్తూ.. హిందువులలో ఐక్యతను, మానవత్వాన్ని పెంపొందించేలా తనదైన శైలిలో ప్రసంగాన్ని సాగిస్తూ ఆకట్టుకుంటుంటారు. అలాంటి ఎమ్మేల్యే రాజాసింగ్ దీపావళి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మేల్యే రాజాసింగ్ దీపావళి రోజు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఎమ్మేల్యే మాట్లాడుతూ… హిందువులందరూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలన్నారు. అలాగే టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలన్నారు. అయితే ఇటువంటి ప్రసంగం చేసిన రాజాసింగ్.. ఓ సూచన సైతం జారీ చేశారు. దేవుడి బొమ్మలతో గల పటాకులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని, అటువంటి పటాకుల తయారీ వెనుక కుట్ర ఉందన్నారు.
ప్రధానంగా లక్ష్మీ దేవి బొమ్మ ఉన్న టపాసులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసి కాల్చవద్దని, దేవుళ్ళ బొమ్మలు ఉన్న ఎటువంటి టపాసులైనా, కొనుగోలు చేయకుండా హిందువులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మన దేవుళ్లను మనం పూజిస్తాం. అటువంటిది దేవుళ్ల బొమ్మలు ఉన్న టపాసులను మనమే కాల్చడం ఎంతవరకు సమంజసమన్నారు.
Also Read: Pushpa 2 Diwali Wishes: దీపావళికి బ్లాస్ట్ అయ్యేలా.. పుష్ప 2 అప్డేట్..!
ఎమ్మేల్యే రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ నిర్వహించడం ఆనవాయితీ. అలా అమ్మవారిని పూజించే మనం, సాయంత్రం కాగానే, ఆ దేవి బొమ్మలతో తయారు చేసిన టపాసులు కొనుగోలు చేయడం, వాటిని కాల్చడం ఏమిటని రాజాసింగ్ ప్రశ్నించారు. అయితే కొందరు రాజాసింగ్ ప్రకటనతో ఏకీభవిస్తూ, ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. చివరగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలను ఎమ్మేల్యే తెలిపారు.