EPAPER

Konda Surekha: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కొండా సురేఖపై చర్యలుంటాయా? అధిష్టానం ఏం చెప్పింది?

Konda Surekha: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కొండా సురేఖపై చర్యలుంటాయా? అధిష్టానం ఏం చెప్పింది?

Konda Surekha: హస్తినలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయా? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ ఆరా తీసిందా? హైకమాండ్‌కు కొందరు నేతలు రిపోర్టు ఇచ్చారా? మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారు? ఇంతకీ కొండా సురేఖ కేబినెట్‌లో కొనసాగుతున్నారా? లేక డ్రాపవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామంది తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.


మంత్రి కొండా సురేఖ-కేటీఆర్ వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలను ఢిల్లీ వేగులు అధిష్టానానికి రిపోర్టు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు జోరుగా చెబుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి సురేఖ‌పై హైకమాండ్ వేటు వేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు వెళ్లడం, పనిలో పనిగా పార్టీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆరా తీసినట్టు ఢిల్లీ పొటిలికట్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి సమాధానంతో హైకమాండ్ కూల్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ సీఎం రేవంత్ ఏం చెప్పారు? అధిష్టానం ఏమంది? అనేదే అసలు చర్చ.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను టార్గెట్ చేశారని మంత్రి కొండా సురేఖ పదేపదే మీడియా ముందు చెప్పుకొచ్చారు. తన గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగు‌లు పెట్టి, తన క్యారెక్టర్‌ను కించపరిచారని మండిపడ్డారు. ఒకానొక దశలో ఆమె కంటతడి పెట్టారు కూడా. పట్టరాని కోపంతో కేటీఆర్ వ్యవహారంలోకి సినిమా వారిని లాగడంతో వివాదం మరింత జఠిలమైంది.

ALSO READ: మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు కోర్టుకు నాగార్జున.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!

చివరకు మంత్రి కొండా సురేఖ సినిమా వారికి క్షమాపణలు చెప్పారు. పరిస్థితి గమనించిన టీపీసీసీ క్లారిటీ ఇచ్చింది. అయినా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వర్గం కావాలనే పదే పదే రెచ్చగొట్టినట్టు పసిగట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగారు.

గతంలో సినిమా వారిపై రాజకీయ నేతలు చేసిన కామెంట్స్ ప్రస్తావించారు కొందరు నేతలు. విపక్షం ట్రాప్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవారు పడ్డారని, జాగ్రత్త అంటూ సూచన చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మంత్రి వర్గం విస్తరణలో ఆమెను ఉంచుతారా లేదా అనేదానిపై చిన్నపాటి చర్చ జరుగుతోంది. ఆమె ఆవేదనలో అర్థం ఉండడంతో ఎలాంటి చర్యలు ఉంచకపోవచ్చనేది ఢిల్లీ సమాచారం. ఉన్నవారి శాఖలు మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

Related News

Jagadish Reddy: భట్టి విక్రమార్క బహిరంగ చర్చకు సిద్ధమా..? జగదీశ్ రెడ్డి సవాల్

Jupally: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

Crop Loan War : రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ దిమ్మ తిరిగే క్లారిటీ

TDP In Telangana: తెలంగాణ వైపు టీడీపీ చూపు.. ఎఫెక్ట్ ఎవరికి ? వలసలకు లీడర్స్ రెడీ అయ్యారా..

CM Revanthreddy Amitshah: అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ వెనుక.. ఐపీఎస్‌లతోపాటు..

Konda surekha comments: మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు కోర్టుకు నాగార్జున.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!

×