EPAPER

Congress Manifesto : అభయహస్తం.. 42 పేజీలు.. 67 అంశాలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

Congress Manifesto : అభయహస్తం.. 42 పేజీలు.. 67 అంశాలు..  కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
telangana congress news

Congress Manifesto(Telangana Congress News):


తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.

42పేజీల్లో 66 ప్రధాన అంశాలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటించింది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించింది. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి తెలంగాణలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.


కాంగ్రెస్ అభయహస్తం.. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సంక్షేమానికి ఈ మేనిఫెస్టో దిక్సూచి లాంటిదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

రాజకీయాలు కాదు.. ప్రజలే తమకు ముఖ్యమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి.. అక్రమాలు తప్ప ఇంకేమీ లేవన్నారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నది ఇందుకోసమేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తామిచ్చిన హామీలను అమలు చేయడం పక్కా అన్నారు ఖర్గే.

మేనిఫెస్టోలోని అంశాలు..

  1. 6 గ్యారెంటీలకు అదనంగా 67 అంశాలు
  2. ప్రజల ఆకాంక్షలు మేరకు పూర్తిస్థాయిలో ప్రజాస్వామిక పరిపాలన
  3. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజా దర్బార్
  4. తెలంగాణ తొలి, మలి దశ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ. 25 వేల గౌరవ పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  5. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు
  6. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ
  7. రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు
  8. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్
  9. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా
  10. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీల రద్దు
  11. కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో అవినీతిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ
  12. 6 నెలల్లో మెగా డీఎస్సీ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ
  13. వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల, నిర్ణీత కాలంలో 2 లక్షల పోస్టుల భర్తీ
  14. ప్రతి విద్యార్థికి ఫ్రీ వైఫై సౌకర్యం
  15. బడ్జెట్ లో విద్యారంగానికి ప్రస్తుత వాటా 6 శాతం నుంచి 15 శాతానికి పెంపు
  16. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనం రూ.10 వేలకు పెంపు
  17. మూతబడిన 6 వేల పాఠశాలలు తిరిగి మెరుగైన సదుపాయాలతో ప్రారంభం
  18. బాసర ట్రిపల్ ఐటీ తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటీల ఏర్పాటు
  19. ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మోకాలు సర్జరీకి కూడా వర్తింపు
  20. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ , భూహక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం
  21. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు, అన్ని భూ హక్కుల సమస్యల పరిష్కారం
  22. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి భూ హక్కుల కల్పన
  23. స్థానిక సంస్థలను బలోపేతం చేసి.. నిధులు, విధులు, నిర్వహణ బాధ్యతల అప్పగింత
  24. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల గౌరవ వేతనం రూ. 1500కు పెంపు, మాజీ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్
  25. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ పెండింగ్ లో ఉన్న 3 డీఏలు తక్షణ చెల్లింపు
  26. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు
  27. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ .. 6 నెలల్లోనే సిఫార్సులు అమలు
  28. ఆర్టీసీ సిబ్బందికి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లింపు
  29. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థికసాయం
  30. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలు 50 శాతం రాయితీతో వన్ టైమ్ సెటిల్ మెంట్
  31. బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు
  32. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ , మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు.
  33. బీసీల కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు
  34. సంచార జాతులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు
  35. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో బీసీ భవనాల ఏర్పాటు
  36. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు
  37. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు
  38. వెనుకబడిన తరగతులకు సబ్ ప్లాన్ అమలు
  39. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
  40. సరిపడా నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ అమలు
  41. నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో రూ. లక్ష, ఇందిరమ్మ కానుకగా తులం బంగారం
  42. సింగరేణిలో కారుణ్య నియామకాల విధానం సరళీకృతం
  43. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి సంస్థ ప్రవేటీకరణ కాకుండా చర్యలు
  44. బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్ఐ అమలు
  45. గీత కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా
  46. యాదవ, కురమలకు గొర్రెల పెంపకం కోసం దళారీలు లేకుండా నేరుగా రూ. 2 లక్షల సాయం
  47. రాజస్థాన్ తరహాలో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత
  48. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
  49. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి సంస్థను ప్రవేటీకరించం
  50. బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్ఐ అమలు
  51. గీత కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా
  52. యాదవ, కురమలకు గొర్రెల పెంపకం కోసం దళారీలు లేకుండా నేరుగా రూ. 2 లక్షల సాయం
  53. రాజస్థాన్ తరహాలో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత
  54. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
  55. తెల్ల రేషన్ కార్డుపై ఇకపై సన్నబియ్యం సరఫరా
  56. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షే బోర్డు ఏర్పాటు
  57. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
  58. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు
  59. ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు
  60. హోంగార్డుల వేతన సవరణతోపాటు అన్ని సమస్యలు తక్షణ పరిష్కారం
  61. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు
  62. అంగన్ వాడీ టీచర్లకు నెలవారీ వేతన రూ. 18 వేలకు పెంపు, ఈపీఎఫ్ తో ఉద్యోగ భద్రత
  63. 50 ఏళ్లు దాటిన జానపద కాళాకారులకు రూ. 3 వేల పెన్షన్
  64. ఉస్మానియా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ఆధునీకరణ
  65. ఎల్బీనగర్, ఆరాంఘర్, మెహదీపట్నం, బీహెచ్ ఈఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలు
  66. హైదరాబాద్ నగరాన్ని ముంపురహిత నగరంగా తీర్చిదిద్ది, నాలా ఆధునికీకరణకు చర్యలు
  67. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో ఆస్తిపన్ను, ఇంటిపన్ను బకాయిలపై ఉన్న పెనాల్టీల రద్దు
  68. నగరపాలక, మున్సిపాలిటీ కేంద్రాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

పూర్తిస్థాయి మేనిఫెస్టో ఇదే..

.

.

.

.

.

Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×