EPAPER

MLA Kaushik Reddy: కేసీఆర్ ఖండించాలి.. లేదంటే ఆయనే ఇదంతా చేస్తున్నట్టు లెక్క: అద్దంకి దయాకర్

MLA Kaushik Reddy: కేసీఆర్ ఖండించాలి.. లేదంటే ఆయనే ఇదంతా చేస్తున్నట్టు లెక్క: అద్దంకి దయాకర్

BRS MLA: ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య రాజుకున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డికి అరికెపూడి కౌంటర్ చాలెంజ్ చేశారు. ఒక వేళ ఉదయం 11 గంటల కల్లా పాడి కౌశిక్ రెడ్డి రాకుంటే.. తానే ఆయన ఇంటికి వెళ్లుతానని సవాల్ చేశారు.


సవాల్ చేసినట్టుగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లడంతో.. ఉభయ వర్గాల మధ్య తోపులాట, టమాటలు, పూల కుండీలతో దాడులు చేసుకున్నారు. అరికెపూడి ఆంధ్రాకు చెందిన వ్యక్తి అని, తాను తెలంగాణ బిడ్డను అని పేర్కొన్నారు. అరికెపూడి పై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఎదుట కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు సహా పలువురు నాయకులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.

అద్దంకి దయాకర్ పాడి కౌశిక్ రెడ్డిపై విమర్శలు కురిపించారు. అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని, ఇన్నాళ్లు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉన్నాడని, అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే స్పందించాలని, లేదంటే.. కౌశిక్ రెడ్డితే ఆయన ఇలా మాట్లాడించాడని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రానో.. మరో రాష్ట్రం మీద సెంటిమెంట్ రగిలించి పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రోళ్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే నోటితో తీస్తానని కేసీఆర్ అన్నాడని, ఆంధ్రోళ్లను ఓట్లకోసమే వాడుకున్నారని ఇప్పుడు అర్థమవుతున్నదని వివరించారు.


Also Read: Arekapudi Gandhi: మాపైనే కౌశిక్ దాడి చేసి.. పూల కుండీలు విసిరేశారు: అరికెపూడి గాంధీ

ఇక దానం నాగేందర్ నార్సింగ్ పోలీసు స్టేషన్ దగ్గర మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి రెచ్చగొడుతూ ఇంటికి వస్తానని రాలేదని, దీంతో అరికెపూడి, కౌశిక్ ఇంటికి వెళ్లాడని వివరించారు. శత్రువైనా సరే ఇంటికి వస్తే మర్యాద ఇవ్వాలని, కానీ, ఇంటికి రమ్మని పిలిచి ఇంట్లో రౌడీలను తెచ్చుకుని పూల తొట్టులతో దాడి చేయించాడని ఆరోపించారు. చేసిందంతా చేసి.. సీపీ ఆఫీసు ముందు కూర్చుని కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆంధ్రోడా నువ్వు ఎక్కడుంటావ్ అని తమ ఎమ్మెల్యేలను కౌశిక్ రెడ్డి కామెంట్ చేశాడని, కేసీఆర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Harishrao: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్‌రావు

తాను కూడా హైదరాబాద్ వాడినేనని, ఒక్క పిలిపిస్తే టీఆర్ఎస్ లీడర్లందరి ఇళ్లనూ బ్లాక్ చేయగలమని దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు అది సంసారా? ఇప్పుడు తాము కాంగ్రెస్‌లో చేరితే ఇది వ్యభిచారమా? అంటూ నిలదీశారు. పాడి కౌశిక్.. నువ్వు ఒక పిల్ల బచ్చాగాడివని కామెంట్ చేశారు. స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Related News

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

CM Revanth Reddy: హైడ్రా ఆగదు.. ఆ పెత్తనం సాగదు: సీఎం రేవంత్

Rajiv Gandhi statue: రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ రాద్ధాంతం ఎందుకు? కేటీఆర్ అంత మాటెందుకు అన్నాడు?

Telangana Liberation Day: పాలనే లేదు.. ప్రజా పాలన దినోత్సవమేంటీ?: కేటీఆర్ విసుర్లు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

CM Revanth: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

Big Stories

×