Big Stories

Congress: కాంగ్..రేస్.. తెలంగాణలో తడాఖా..

congress priyanka

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. మంచి ఊపు మీద ఉన్న టీ కాంగ్రెస్‌ ఈ టెంపోను కంటిన్యూ చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసింది. గట్టిగా ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయమే ఉంది. ఏ క్షణమైనా షెడ్యూల్‌ రావొచ్చు. దాంతో కాంగ్రెస్‌ నిత్యం జనాల్లో ఉండేందుకు నిర్ణయించింది. ఇప్పటికే విభేదాలన్నీ పక్కనబెట్టి.. హస్తం నేతలంతా ఏకమయ్యారు. చేయి చేయి కలుపుతున్నారు. అంతా కలిసి ఒకే బస్సులో యాత్ర చేయనున్నారు. రాష్ట్రమంతా చుట్టేయనున్నారు.

- Advertisement -

ఇప్పటికే భట్టి యాత్ర కొనసాగుతోంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో నడిచారు భట్టి. అంతకముందు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా.. పాదయాత్రతో జోష్‌ నింపారు. మరికొందరు నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. కొందరు పర్మిషన్‌ కోసం హైకమాండ్‌కు అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు సింగిల్‌గా కార్యక్రమాలు చేస్తోన్న నేతలు.. బస్సు యాత్రతో అంతా ఒకటి అవుతున్నారు. ఒకే బస్సులో లీడర్లంతా.. జనం ముందు కనిపించనున్నారు.

- Advertisement -

గతంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ ప్రకటించింది కాంగ్రెస్‌. అధికారంలోకి వస్తే.. రైతుల కోసం ఏం చేస్తామో స్పష్టం చేసింది. అలాగే ఇటీవల సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల డిక్లరేషన్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో…అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగ నియామకాలు అటెక్కాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్‌. వేసిన నోటీఫికేషన్లలో కూడా పేపర్‌ లీక్‌ కావడంతో.. ఈ అంశాలతో అధికార బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడుతోంది.

ఇప్పటిక రెండు డిక్లరేషన్‌ల రూపంలో కీలక హామీలు ఇచ్చింది కాంగ్రెస్. డిక్లరేరషన్ అంటే.. నథింగ్‌ బట్‌ మేనిఫెస్టో. మొన్నీమధ్య… కర్ణాటకలో కూడా ఇదే ట్రెండ్‌ ఫాలోయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు.. గ్యారెటీ కార్డుతో ఐదు కీలక హామీలు ఇచ్చారు. ఇవి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయ్‌. హామీలు ఇవ్వడమే కాదు.. ప్రమాణస్వీకారం చేసిన రెండు గంటలకే.. ఈ హామీలపై సంతకం చేశారు సీఎం సిద్ధరామయ్య. తెలంగాణలో కూడా తాము అధికారంలోకి వస్తే.. ఇలానే చేస్తామని చెబుతోంది టీకాంగ్రెస్‌.

కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు.. తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉంది. పార్టీ సెంట్రల్‌ లీడర్లు, కేబినెట్‌ మంత్రులను తీసుకొచ్చి సభలు నిర్వహించింది. అయితే కన్నడ ప్రజల తీర్పు తర్వాత… తెలంగాణలోని కమలనాథులు కాస్త చల్లబడ్డారు. దాంతో కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచింది. అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించి.. అధికారంలోకి వచ్చేది తామేనంటూ తేల్చి చెబుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి జోష్‌ వచ్చింది. ఇక ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. భారీ ప్లాన్‌తో ఆమె.. రాష్ట్రంలో వ్యూహాలు రచించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News