EPAPER

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

EX Mla Jaggareddy Comments: తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేట్. రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో జగ్గారెడ్డి దిట్ట. ఆ ప్రతి విమర్శలు చేసే సమయంలో డైరెక్ట్ అటాక్ చేస్తారు జగ్గారెడ్డి ( Jagga Reddy ). అందుకే జగ్గారెడ్డి ( Jagga Reddy ) కి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై జగ్గారెడ్డి ( Jagga Reddy ) చేసిన కామెంట్స్ పొలిటికల్ పంచ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాబోయే వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు, చెరువుల అక్రమ నిర్మాణాలు తొలగింపుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే మూసీ నది ప్రక్షాళన పేరుతో సుందరీకరణకై అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఎఫ్టిఎల్, బఫర్ జోన్ పరిధిలో గల అక్రమ కట్టడాలను తొలగించేందుకు హైడ్రాను రంగంలోకి దింపింది. దీనితో పలు చోట్ల నిరసనలు వ్యక్తమైనప్పటికీ.. ప్రభుత్వం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగింది.

కాగా.. బీఆర్ఎస్ సైతం అక్రమ కట్టడాల కూల్చివేతపై నిరసన గళమెత్తింది. అకస్మాత్తుగా వరదలు వచ్చిన సమయంలో వరద నీటిని తట్టుకొనే శక్తి చెరువులకు కావాలి.. అందుకు అక్రమ కట్టడాల కూల్చివేతే మార్గమన్నది రేవంత్ ( CM Revanth Reddy) సర్కార్ వాదన. అలాగే మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం అక్రమ కట్టడాల కూల్చివేతలను సాగిస్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం రోజుకొక మాటతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇలా ఇటీవల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR) నేరుగా రాహుల్ గాంధీ ( Rahul Gandhi)కి లేఖ సైతం రాశారు. అంతేకాదు పలు ట్వీట్ లను ట్యాగ్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జోరు సాగించారు.


Also Read: Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

అలాగే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సైతం ఇదే విషయంపై రాహుల్ గాంధీ( Rahul Gandhi) కి లెటర్ రాశారు. అంతటితో ఆగక.. ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga Reddy ) రిప్లై ఘాటుగా ఇచ్చారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హరీష్‌ రావు ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నాడు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్‌ కుటుంబం. ఒక్క హామీ కూడా అమలు చేయని నువ్వు.. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటానా అన్నారు. అలాగే నువ్వు.. నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్‌ ఫాం హౌస్‌ దగ్గర దీక్ష చేస్తా.. నువ్వు ఢిల్లీ పోయిన రోజే నేను మీ మామ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు.

అయితే ఇవేమీ పట్టించుకోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. బాధితులకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ.. సుపరిపాలన సాగిస్తోందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే రైతన్నల వద్ద ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ విమర్శలు ఒక వైపు.. కాంగ్రెస్ రివర్స్ పంచ్ లు మరోవైపు కొనసాగుతుండగా.. తెలంగాణ పొలిటికల్ హాట్ గా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Related News

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

KTR Reaction: గబ్బు మాటలు మాట్లాడుతున్నారని కోర్టులో పరువు నష్టం దావా వేశా: కేటీఆర్

Nukala Naresh Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత నరేష్‌రెడ్డి ఇక లేరు

Big Stories

×