EPAPER

BRS Party: కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BRS Party: కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Congress Party: కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మొదటి నుంచి మోసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ పై పోరాడటానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా.. పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. అలాంటి బీజేపీపై గులాబీ, హస్తం పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా హాజరై.. ప్రజల తరఫున పోరాడాలని తాము ఆహ్వానించామని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ ప్రజల సమస్యల మీద అంటీ ముట్టనట్టు ఉన్నారని విమర్శించారు. ఆయన వచ్చే ముందు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారో గుర్తు చేసుకుని ఏ హామీలను నెరవేర్చారో ఓసారి అవలోకనం చేసుకోవాలని సూచించారు. తాము ఏం హామీలు పెట్టామో.. అందులో ఏమేమీ ఈ స్వల్ప సమయంలోనే నెరవేర్చామో చర్చిద్దామని, యదాద్రి వేదికగా చర్చ పెడదామని సవాల్ విసిరారు. దళిత సీఎం నుంచి దళితులకు మూడెకరాల భూమి వరకు, ఇంటికి ఉద్యోగం, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఏదీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఎవరు ఏం చేశారో యాదాద్రి వేదికగా చర్చ పెట్టి చెప్పడానికి సిద్ధమా? అని చాలెంజ్ చేశారు.

అదే విధంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లపై విమర్శలు కురిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయను కమీషన్ల కోసమే ప్రారంభించిందని ఆరోపించారు. అది మిషన్ కాకతీయ కాదని, కమిషన్ కాకతీయ అని ధ్వజమెత్తారు. తాము చెరువులను కాపాడుతుంటే ఆ కమిషన్ కాకతీయ రూపకర్త హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 33 జిల్లాలలో పది వేల కోట్లతో నిధులు కేటాయించింది కమిషన్ తీసుకునే కదా? అని అడిగారు. అందుకోసమే తాము ఆ పనులను తొలగించామని వివరించారు.


Also Read: WWIII: మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. మనమెటు?

ఇక కేటీఆర్.. ట్విట్టర్‌లో బుల్డజోర్ ప్రభుత్వం అంటూ ఏవేవో రాతలు రాస్తున్నారని ఎంపీ చామల మండిపడ్డారు. ఖర్గే ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఇది బుల్డోజర్ ప్రభుత్వం అంటూ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. ఒక మున్సిపల్ మంత్రిగా పని చేసిన కేటీఆర్.. అక్రమ నిర్మాణం అని తెలుసి కూడా ఫాం హౌజ్‌ను లీజ్‌కు తీసుకున్నాడన్నారు. ఇక బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. వారి విద్యా సంస్థలను మాత్రమే కూలుస్తారా? వీరి విద్యా సంస్థలను కూల్చరా? అంటూ కామెంట్ చేస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన విద్యాసంస్థల కూల్చివేతకు సెలవుల వరకు వేచి చూస్తామని తెలిపారు. లేదంటే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే ముప్పు ఉన్నదని వివరించారు. రూల్ అందరికీ ఒకేలా వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే కేవలం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడమే అయిపోయిందని చురకలంటించారు.

Related News

Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!

Farmers: బ్రేకింగ్ న్యూస్.. రైతులకు భారీ శుభవార్త

KTR: రేవంత్ రెడ్డి… నీకు దమ్మంటే ఆ నిర్ణయం తీసుకో : కేటీఆర్

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Bhatti: ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్టుకొంటూ పరువు తీస్తున్నారు: భట్టి

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

Amrapali: తీపి కబురు చెప్పిన ఆమ్రపాలి..

Big Stories

×