EPAPER

Telangana BJP: తెలంగాణా బీజేపీలో రచ్చ.. అధ్యక్ష పదవి ఎవరికంటే..?

Telangana BJP: తెలంగాణా బీజేపీలో రచ్చ.. అధ్యక్ష పదవి ఎవరికంటే..?

యాబై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి పట్టుమని పదిమంది శాసనసభ్యులు లేరు, కానీ పదవుల కోసం వెంపర్లాడుతున్న నేతలతీరు మాత్రం బజారుకెక్కుతోంది. పూర్తిగా కాషాయ సిద్దాంతానికి విరుద్దంగా జరుగుతున్న పరిణామాలు సంఘ్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచే కొత్త నేతలను తయారుచేసుకోడంలో సంఘ్ నేతలు ముందున్నా.. అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహార శైలి కనిపిస్తోంది. అంతేకాదు కొత్త తరాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలం అవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ఇతర పార్టీల నేతలపై అదారపడుతుండటం, వారికే పెద్దపీట వేయడం వంటి అంశాలు సంఘ్ పరివార్ లక్ష్యాలకు ఎసరు పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంఘ్ పరివారుల లెక్కలు అటుంచుతే.. అసలు వదిలేసి కొసరు పట్టుకున్నట్టు రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నేతల వైరం మళ్లీ రగులుకుంది. అనుకున్న లక్ష్యాలు పక్కన పెడితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలను గెలిచి, రెండు కేంద్ర మంత్రి పదువులను దక్కించుకొని ఊపుమీదున్న బీజేపీ ఇప్పుడు మరో పంచాయితీతో తలలు పట్టుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సికింద్రాబాద్ నుంచి రెండో సారీ ఎంపీగా గెలిచిప కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీకి రథసారదెవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.


Also Read: చిరు- బండి సంజయ్ మధ్య చర్చ.. మీరొస్తే ప్రయార్టీ..

తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ అంశం అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పీఠాన్ని వరించేది కొత్త నేతా, పాత నేతా అనేది ఇప్పుడు బీజేపీలో రచ్చ రేపుతోంది. ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ పేరు కన్‌ఫర్మ్ అయిందని, అఫిషియల్‌గా అధిష్టానం ప్రకటించడమే తరువాయనే ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతల మధ్య మరోసారి పాత కొత్త నేతలనే విభేదాలు భగ్గుమంటున్నాయి.

ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థుల అభినందన సన్మాన సభలో లక్ష్మణ్ ఘాటుగానే స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కోవాలంటే.. పార్టీ వ్యవహారాలని కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి, త్యాగాలు చేసిన వారికే కట్టబెట్టి వారి రుణం తీర్చుకోవాలని ఆవేశంగా సూచించారు. అంతేకాదు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం లక్ష్మణ్ మాటలకు వంతు పాడారు.

అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, సామర్థ్యం వున్న వారికే అధ్యక్ష పదవి అప్పజెప్పాలని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. అంటే ఇండైరెక్టుగా ఈటల రాజేందర్ అధ్యక్షతను వ్యతిరేఖించడమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు అలా ఎందుకు మాట్లాడారనే చర్చ కూడా కమలంలో కొనసాగుతోంది. అంతేకాదు కొత్త నేతలకు అధ్యక్ష పదవే కాదు సంస్థాగతంగా ఇంకేపదవి ఇచ్చేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు సుముఖత చూపడంలేదనే చర్చ నడుస్తోంది.

Also Read: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అయితే కొత్త నేతలు పదవులకు పనికిరారా, ప్రచారానికి మాత్రమే పనికొస్తారా అన్న చర్చ పార్టీలో మొదలైంది. ఇదే అంశం గత అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చరేపింది. ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో యెన్నే శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో కొత్త నేతలంతా రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఒక్కొక్కరు బీజేపీనీ వీడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వ శక్తులు ఒడ్డి గెలిస్తే ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని, అయా నేతల అనుచరులు బీజేపీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలిచామనే సంతృప్తి కన్నా వలస నేతలు పదవులకు అర్హులు కాదనే నేతల వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పు కాదు అది ఇన్ సైడ్ ఉండాలి కానీ వాటిని బహిరంగంగా ప్రకటించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది… ఆ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ సైతం కొత్త పాత నేతలపై స్పందించారు.. పార్టీ అధ్యక్ష పదవికి స్ట్రీట్‌ ఫైటర్ కావాలా? రియల్‌ ఫైటర్ కావాలా? అంటూ సైటెర్లు వేశారాయన. రాజాసింగ్ వెర్షన్‌ను లైట్ తీసుకుంటూ.. తాను రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు ఈటల రాజేందర్.

పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికే పెద్దపీట వేయాలని.. లేదంటే భవిష్యత్ అంధకారమే అనే అభిప్రాయాలు బీజేపీలో పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నేతల పరిస్థితేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటల రాజేందర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడనే ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈటల పరిస్థితేంటి? ఆయన కాకపోతే అధ్యక్షపదవికి సరిపడే పాత నేతలెవరున్నారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లక్ష్మణ్, రాజసింగ్ ల వాఖ్యల వెనక మర్మం ఏంటన్నది ఆ పార్టీ వర్గాలకే అంతుపట్టడం లేదంట.

Related News

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Konda Surekha: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

KVP: రండి మార్కింగ్ వేయండి.. నేనే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

Big Stories

×