Big Stories

Telangana Coal Politics : బొగ్గు రాజకీయం.. కేటీఆర్ చెప్పినదానిలో నిజమెంత ?

Singareni Coal Politics in Telangana(Today news in telangana): తెలంగాణలో బొగ్గు రాజకీయం నడుస్తుంది. సింగరేణి సంస్థను దివాలా తీసే ప్రయత్నం జరుగుతుంది. దానికి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేతులు కలిపాయి. ఇలా సాగిపోతుంది బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణల పర్వం. మరి ఇది నిజంగా నిజమా?

- Advertisement -

కేసీఆర్ ఉన్నన్ని రోజులు వేలం పాట జరగలేదు. ఇది కూడా వారే చెబుతున్నారు. అంటే కేసీఆర్ ఉన్నన్ని రోజులు వేలం పాట జరగలేదు. కానీ ఇప్పుడు జరగుతుంది. ఇది కాంగ్రెస్‌, బీజేపీ నేతలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర. పక్కా ప్లాన్‌ ప్రకారం జరుగుతున్న కుట్ర ఇది. ఇదీ కేటీఆర్ చెస్తున్న ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు.

- Advertisement -

సో.. సింగరేణి కోసం కేటీఆర్ పోరాడుతున్నారు. సంస్థను కాపాడేందుకు చెమటోడుస్తున్నారు. నిలదీస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. చేయాల్సిందంతా చేస్తున్నారు. మనం ఆయన పోరాటాన్ని గుర్తించాం.. గుర్తించాలి కూడా. ఇదీ ఆయన వర్షన్.. ఇక అసలు వర్షన్‌కి వద్దాం. మరి ఫ్లోలో చెప్పారో.. ఎవరు గుర్తించరన్న ధైర్యంతో చెప్పారో.. రీజన్‌ ఏదైనా కానీ కొన్ని పక్కా అబద్ధాలు మాత్రం చెప్పారు కేటీఆర్. అదే బీఆర్ఎస్ హయాంలో అసలు కోల్‌ మైన్స్‌ వేలం జరగలేదని. నిజంగానే బీఆర్ఎస్‌ పాలనలో కోల్ మైన్స్ వేలం జరగలేదా ? జరిగాయి.. 100 పర్సెంట్ జరిగాయి. కానీ కావాలనే ఈ విషయాన్ని దాచి.. ప్రజలను అమాయకులను చేసి.. ఇప్పుడు నెపాన్ని మొత్తం కాంగ్రెస్‌ గవర్నమెంట్‌పై వేస్తున్నారు.

Also Read : కేటీఆర్ సీన్ రివర్స్.. ఇక చాల్లే.. తప్పుకో.. అని ట్రోలింగ్!

అప్పుడు లెటర్స్ రాశారు. ఇప్పుడేమో వేడుక చూస్తున్నారు. ఇదేం న్యాయం అంటున్నారు కేటీఆర్. బట్ 2022 అక్టోబర్‌లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్‌ను వేలంలో ఎవరు దక్కించుకున్నారు ? 2023లో ఆగస్టులో జరిగిన వేలంలో సత్తుపల్లి బ్లాక్‌ను ఎవరు దక్కించుకున్నారు ? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా ? ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే చాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తారు. అసలేం జరగలేదన్నట్టు బిహేవ్ చేస్తారు. అంటే గతంలో కూడా తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల వేలం జరిగింది. ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. 2022లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్‌ను దక్కించుకున్నది అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కేసీఆర్‌కు అత్యంత సన్నితులుగా పేరున్న అరబిందో సంస్థకు చెందినది. ఇక 2023లో సత్తుపల్లి బ్లాక్‌ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. ఇది కూడా కేసీఆర్‌కు బంధువైన ప్రతిమ శ్రీనివాస్‌కు చెందినది. అంటే అస్మదీయుల కోసం సింగరేణి గొంతు కోశారని ఇక్కడే అర్థమైపోతుంది.

ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని అనధికారికంగా ఆదేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు. ఆ ఛాన్స్‌ను ప్రైవేట్ కంపేనీలు క్యాష్‌ చేసుకున్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం సింగరేణి వేలంలో పాల్గొంది. ఎట్ ది సేమ్ టైమ్.. సింగరేణికి వేలం లేకుండా బొగ్గు గనులను అప్పగించాలని స్ట్రాంగ్‌గా డిమాండ్ చేస్తుంది.

Also Read : నో వర్క్ .. నో పోస్ట్.. డైలమాలో కేటీఆర్ ఫ్యూచర్

వేలాన్ని అపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఉంది. ఇదే విషయాన్ని వేలం జరగడానికి ముందు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఓ నోటీసును కూడా అందించింది. నిజానికి పెద్ద మనసు చేసుకొని కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించవచ్చు. ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనికి అప్పగించవచ్చు. కానీ కేంద్రం మాత్రం అలా చేయడం లేదు. తమకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకలా.. అనుకూలంగా లేని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా వేలం విషయంలో కేంద్రం అడుగులు ముందుకే పడుతున్నాయి తప్ప.. వెనక్కి తగ్గడం లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. కేంద్ర బొగ్గుగనుల శాఖా మంత్రి మన తెలుగు వాడు.. తెలంగాణ వాడైనా కిషన్‌ రెడ్డి. ఆయన కూడా ఈ విషయంలో ఏమాత్రం కనికారం చూపడం లేదు.

తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్‌, బీజేపీల వ్యవహారం. ఈ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ బొగ్గు బంగారానికి కేరాఫ్‌గా ఉన్న సింగరేణికి అన్యాయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News