CM Revanth Reddy: తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మార్చడంపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటి ద్వారా యువత ప్రొత్సహించినట్లయి తుందని ఆలోచన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. తన మనసులోని ఆలోచనలను బయటపెట్టారు.
త్వరలో స్పోర్ట్స్ పాలసీని తెస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు తీసుకున్న విధానాలను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరిన్ని స్టేడియాలను నిర్మిస్తామన్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ప్రస్తుతం బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో ఆటలు తగ్గి.. రాజకీయ సభలు పెరిగాయన్నారు. అంతే కాదు అవార్డులు వస్తే ఆటోమెటిక్‌గా సాయం అందేలా పాలసీని రూపొందిస్తామని మనసులోని మాటను బయటపెట్టారు.
చెడు వ్యసనాల నుంచి యువతను బయటకు తీసుకురావాలంటే క్రీడలను ప్రొత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌లో రూ.361 కోట్లు కేటాయించా మన్నారు. చదువు కన్నా ఆటల్లో రాణిస్తే.. ఉద్యోగ భద్రత ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దృష్టి పెట్టామన్నారు. విద్యార్హత లేకున్నా క్రికెటర్ సిరాజ్‌కు అన్ని మినహాయింపులిచ్చి గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 500 గజాల స్థలాన్ని ఇచ్చామన్నారు. బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆర్థికసాయం చేశామని, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామన్నారు.
ALSO READ: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే బండ్ల భేటీ, అదంతా తప్పు అంటూ..
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతామన్నారు ముఖ్యమంత్రి. మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
గతంలో తాము క్రీడాకారులను ప్రోత్సహించామని చెప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. రాష్ట్రానికి లబ్ధి కలిగే విషయంలో అందరం కలిసి పనిచేయాలన్నారు కేటీఆర్.
క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ: సీఎం రేవంత్ రెడ్డి#TelanganaNews #AssemblySessions #Congress #RevanthReddy #NewsUpdates #Bigtvlive @INCTelangana @revanth_anumula pic.twitter.com/qkfoO7ay2p
— BIG TV Breaking News (@bigtvtelugu) August 2, 2024