EPAPER

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో

CM Revanthreddy meeting with NRIs: అమెరికా , ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్‌‌ భేటీ, చంద్రబాబు పాలనలో

CM Revanth reddy meeting with NRIs(Telangana congress news today): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావర ణం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రవాస భారతీయులు తమవంతు సాయం చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలను ప్రొత్సహించా లన్నారు. ఆ ఆలోచనలో అమెరికాకు వచ్చామన్నారు సీఎం. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయులు డిక్టేట్ చేసే స్థాయికి చేరుకున్నారన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, చేయబోతున్న ప్రణాళిక లను ఎన్నారైలకు వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని గుర్తు చేశారు. అమెరికాలోకి న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌‌లో ఎన్నారైల పారిశ్రామిక‌వేత్తలతో సమావేశం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణపై దృష్టి పెట్టడమే దీనికి కారణమన్నారు.

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పునాది వేశారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు వున్నా, ఏకాభ్రిప్రాయంతో ముందుకెళ్లామన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నామన్నారు. ఈ విషయంలో అనుమానాలు అపోహాలను తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.


ALSO READ:  మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి: భట్టి

ఇదే క్రమంలో అన్నీ ఉచితంగా ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బ దింటుందని చాలామంది భావిస్తున్నారని  అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అనుచితంగా ఉచితం ఇవ్వడం తప్పన్నారు. అర్హత లేనివారికి ఉచితం ఇవ్వడం తప్పన్నారు. ఆర్థికంగా వెనుబడిన వర్గాలవారిని ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం ఉందన్నారు.

CM Revanthreddy meeting with NRIs
CM Revanthreddy meeting with NRIs

ఆర్టీసీలో మహిళలకు ఉచితం ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించామన్నారు సీఎం. పేదవాడికి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆదాయం పెంచాలనే ప్రాధాన్యతలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

 

Related News

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×