EPAPER

CM Revanthreddy : అభివృద్ది అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు.. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్..

CM Revanthreddy: తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీల సమావేశం నిర్వహించారు. ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు.

CM Revanthreddy :  అభివృద్ది అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు.. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్..

CM Revanthreddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు సీఎం తెలిపారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించనున్నారు.


ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు నిర్దేశించారు. అలాగే ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సహా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కార్యచరణపై అధికారులతో సీఎం కూలంకుషంగా చర్చించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని సీఎం వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.గ్రామ సభలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కో దానికి ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు.


తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు. సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే అన్నారు.

గ్రామసభలు ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సీఎం అదేశించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి జరిగినట్లు అని సీఎం అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలన్నారు. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు.. కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరు. ఎంతటివారైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందని సీఎం హెచ్చరించారు. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు.ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×