EPAPER

CM Revanth Reddy: చెప్పారంటే.. చేస్తారంతే.. అట్లుంటది సీఎం రేవంత్‌తో

CM Revanth Reddy: చెప్పారంటే.. చేస్తారంతే.. అట్లుంటది సీఎం రేవంత్‌తో

చెప్పుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా.. కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది అదెంత పెద్ద అమౌంటో.. కానీ రుణబంధంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న రైతుల రుణం తీర్చుకునేందుకు బ్యాంకర్లకు ఇచ్చేందుకు రెడీ అయిపోయింది ప్రభుత్వం. అది కూడా రాష్ట్ర ఖజానాపై ఎక్కువగా భారం పడకుండా.. చెప్పినట్టుగానే చెప్పిన సమయానికి ముందుగానే మొదట లక్షలోపు రుణాలున్న ప్రతి ఖాతాలో అమౌంట్‌ను క్రెడిట్ చేశారు. ఒకేసారి రైతుల అకౌంట్స్‌లోకి 6 వేల కోట్ల రూపాయలకు పైగా పంచేశారు.

నిజానికి గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాలి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మొత్తాన్ని బ్యాంకర్లకు అందించడం. రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం అనేది నిజంగా ఓ సాహసమే. అందుకే గత ప్రభుత్వాలు మాటలు చెబితే తాము చేసి చూపించామంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. వ్యవసాయరంగానికి ఇదో పండగలాంటి రోజు అంటున్నారు నేతలు. చరిత్రలో ఈరోజు నిలిచిపోతుందని. రైతాంగమంతా సంబరాలు చేసుకునే సమయం అంటున్నారు. ఇదంతా నేతల వర్షన్.. ఇక గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11 లక్షల 8 వేల 171 కుటుంబాలకు చెందిన 11 లక్షల 50 వేల 193 మంది రైతుల అకౌంట్స్‌లో 6 వేల 98.93 కోట్ల నగదు క్రెడిట్ చేశారు. ఫలితం రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకాలు.


Also Read: మొదలైన డీఎస్సీ పరీక్షలు.. పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు

ఎలాంటి తిరకాసులు లేవు.. సాకులు లేవు.రేషన్‌ కార్డులు లాంటి జంజాటాలు లేవు. చెప్పినమాట చెప్పినట్టుగా.. రైతుంలతా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా రుణం తీసుకున్న వారి జీవితాల్లో వెలుగులు నిండేలా దేశంలోనే చరిత్ర సృష్టించేలా, సువర్ణాక్షరాలతో లిఖించేలా.. సాఫీగా రుణమాఫీ చేసింది రేవంత్ సర్కార్.. దీంతో అటు రైతులు హ్యాపీ.. ఇటు ప్రభుత్వ పెద్దలు హ్యాపీ.. నిజానికి ఈ రుణమాఫీ వెనక చాలా పెద్ద ప్లానింగ్ కనిపిస్తోంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌‌‌లో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కొన్ని రుణాలు మాఫీ చేసింది. రుణమాఫీ నిధులు వేసిన బ్యాంకుల్లోని రైతుల లోన్‌‌‌‌ అకౌంట్లు మారిపోయాయి.

దీంతో సుమారు 2 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో చేరకుండా రిటర్న్ అయ్యాయి. ఫలితంగా 9 వేల కోట్ల పాత బాకీలను కూడా కాంగ్రెస్ సర్కారు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెల్లిస్తోంది కూడా గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని కూడా చెల్లిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో 10 రోజుల్లో లక్షన్నర. ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పుటికే దీనికి సంబంధించిన నిధుల సేకరణను కూడా ప్లాన్‌ రెడీ చేసింది.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×