EPAPER

CM Revanth Reddy: బడా గణపయ్యకు సీఎం రేవంత్ తొలి పూజ

CM Revanth Reddy: బడా గణపయ్యకు సీఎం రేవంత్ తొలి పూజ

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే ఖైరతాబాద్.. ఉత్సవాలను నిర్వహించండంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికి తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణలో శాంతీ, మత సామరస్యం, పాడిపంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందుడుగు వేస్తుందన్నారు.

ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిస్టాత్మకంగా తీసుకుని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరిని, నిర్వహకులందరిని కూడా సచీవలయానికి ఆహ్వానించి.. అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించి.. వాళ్ల సమస్యలు తెలుసుకుని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగిందన్నారు.


ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఒక లక్ష 40,000 వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలను నెలకొల్పుతున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ఒక లక్ష 40,000 వేల విగ్రాహారాధన కార్యక్రమంలో ప్రభుత్వం తరుపునుంచి అన్ని గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. దేవుని దయతో అకాల వర్షాల నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డామని పేర్కొన్నారు. అంటే.. భక్తులందరు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిండమే అని.. మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: 70 ఏళ్లు 70 అడుగులు.. ఖైరతాబాద్ గణేష్ దర్శనం షురూ!

ఈరోజు కార్యక్రమంలో దీపాదాస్ మున్షీ , పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అధేవిధంగా డా. రోహిన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి మాజీ శాసన సభ్యులు,  చింతల రామచంద్రా రెడ్డి గజ్జల నగేష్, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకుల అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణా నలుమూలలా గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని తెలిపారు.

ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. 1954 నుంచి ఈనాటి వరకు క్రీశే పి. జనార్ధన్ రెడ్డి ఉన్నప్పుడు.. ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడింది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తెలియజేశారు. గతేడాది ఈ ఉత్సవాలకు తాను వచ్చానని.. ఆనాడు పార్టీ అద్యక్షుడిగా.. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగిందన్నారు. భవిష్యుత్తులో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడాకి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related News

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

TGSRTC Special Buses: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. 600 స్పెషల్ బస్సులు!

Big Stories

×