EPAPER

CM Revanth: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్

CM Revanth: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్

Minister Uttam Kumar Reddy: సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌజ్ లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఆ మూడు పంప్ హౌస్ లను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ ఆదివారం ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌస్ ల ప్రారంభోత్సవ ఏర్పాట్లతోపాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులపై ఆయన సచివాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ. ఎన్. సి అనిల్ కుమార్, డిప్యూటీ ఇ.ఎన్. సి కె. శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంప్ హౌస్ ల ప్రారంభోత్సవం రోజు ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్ల కేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందన్నారు.


సీతారామ లిఫ్ట్ ఐరిగేషన్ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సేద్యంలోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖాధికారులు పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెకుట్ నిర్మాణ అనుమతులు చివరి దశకు చేరడంతోపాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చేరిందన్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టుతోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.

Also Read: కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వనున్నారంటే..? వారికి ఉండాల్సిన అర్హతలివే..


అదే సమయంలో కాలువల నిర్మాణంలో అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణం ఆగిపోకుండా ఉండేలా ఆ శాఖతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలంటూ మంత్రి సూచించారు. 34.561, 37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న క్రాసింగ్ ల విషయమై మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తూ రైల్వే శాఖతో చర్చించి ఆ శాఖ నిబంధనల మేరకు సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్యాకేజ్ 1,2 లకు సరిపడా భూసేకరణను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఈ రెండు ప్యాకేజీలకు అవసరమయ్యే 3 వేల ఎకరాల భూసేకరణ సత్వరమే చెపట్టగలిగేతే నిర్దేశిత లక్ష్యానికి సకాలంలో చెరుకోగలుతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మొత్తం త్వరితగతిన పూర్తి అయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 2 లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వస్తున్నందున పనుల వేగం పెంచాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×