EPAPER

CM Revanth Reddy @ Medigadda Barrage: మేడిగడ్డకు చేరుకునున్న రేవంత్ బృందం.. కుంగిన పిల్లర్లను పరిశీలించిన నేతలు

CM Revanth Reddy @  Medigadda Barrage: మేడిగడ్డకు   చేరుకునున్న రేవంత్ బృందం.. కుంగిన పిల్లర్లను పరిశీలించిన నేతలు

CM Revanth Reddy Visits Medigadda Barrage Highlights: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై.. అధికార కాంగ్రెస్ – ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్న కృష్ణాజలాలపై అసెంబ్లీలో చర్చ జరుగగా.. నేడు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 5వ రోజు అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే.. రేపటికి వాయిదా వేసి.. వారంతా గరుడ బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. మేడిగడ్డను సందర్శించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.


అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం.. మీడియా పాయింట్ లో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. మేడిగడ్డను కాంగ్రెస్ ప్రభుత్వం భూతద్దంలో చూడటం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే నిర్మించలేదని, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, మిడ్ మానేరు, అన్నారం బ్యారేజ్ ఇలా చాలా నిర్మాణాలు జరిగాయని, మేడిగడ్డ సంఘటన చాలా చిన్నది అని పేర్కొన్నారు. యాసంగి పంటలకు నీరిచ్చే సమయానికి మేడిగడ్డ డ్యామేజీని సరిచేయాలని కోరారు. యాసంగి పంటలకు, వర్షాకాలం వచ్చే సమయానికి రైతులకు ఇబ్బంది లేకుండా మేడిగడ్డను సరిచేయాలని, దీనిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయొద్దన్నారు.

Read More: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ..


అంతకుముందు అసెంబ్లీలో మేడిగడ్డపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఖజానాలో చాలా డబ్బును వృథా చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాలను పెంచేసి నాసిరకం నిర్మాణాలు చేశారని ఎద్దేవా చేశారు. వేలకోట్ల వ్యయం చూపించి.. ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం గాలికొదిలేశారని దుయ్యబట్టారు. మేడిగడ్డను సందర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రావాలని, హరీష్ రావు కూడా మేడిగడ్డకు వస్తే.. అసలేం జరిగిందో అంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. కేసీఆర్ కూడా మేడిగడ్డకు రావాలని, ఆయనకోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ సిద్ధం చేశామన్నారు.

Read More : కేసీఆర్ కూడా మేడిగడ్డకు రావాలి.. హెలికాఫ్టర్ రెడీ : సీఎం రేవంత్ రెడ్డి

కాగా.. గతేడాది అక్టోబర్ 21న భారీ శబ్దంతో మేడిగడ్డ పిల్లర్ కుంగింది. సుమారు 5 ఫీట్ల పైగా భూమి లోపలికి సింక్ కుంగింది. 50-60 మీటర్ల వరకూ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయి. మేడిగడ్డ ఎందుకు కుంగిందో బీఆర్ఎస్ సరైన సమాధానమివ్వలేదు. విజిలెన్స్ అధికారులు.. మేడిగడ్డపై రిపోర్టు తయారు చేసివ్వగా.. అందులో నిజనిజాలెంతో తేల్చేందుకే.. సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం బ్యారేజీ కుంగుబాటును పరిశీలించారు.అనంతరం సీఎం తో పాటు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను, గేట్లను పరిశీలించారు. వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా డ్యాంపై నుంచి బ్యారెజీని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం. ఆ తర్వాత నదిలోకి వెళ్లి కుంగిన డ్యాం 21వ పిల్లర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులోని లోపాలు, అవినీతి జరిగిన తీరుతెన్నులను వివరిస్తూ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు హాజరయ్యారు.

మేడిగడ్డ డిజైన్‌ నిర్మాణంలో జరిగిన నాణ్యత ప్రమాణాలు,లోపాలు, కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులపై ఇటీవల విచారణ జరిపిన విజిలెన్స్ బృందం సిద్ధం చేసిన నివేదిక మేరకు ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆ నివేదిక తేల్చిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా ఇదే పద్ధతిలో అనేక లోపాలు, అవకతవకలతో పనులు జరిగాయని విజిలెన్స్ అధికారుల బృందం తేల్చింది. కాగ్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను గతంలో వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారెజీ సందర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×