EPAPER

CM Revanth Reddy: దొంగ నాటకాలు.. మానుకోండి.. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ హెచ్చరిక

CM Revanth Reddy: దొంగ నాటకాలు.. మానుకోండి.. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ హెచ్చరిక

హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద శనివారం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినం సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అలాగే సద్భావన అవార్డుకు ఎంపికైన గీతారెడ్డిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పాలనలో పేదలకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదన్నారు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అసలైన అన్యాయం జరిగిందని, అందుకే రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది తాము అధికారం చేపట్టామన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని, మహిళలకు రిజర్వేషన్ లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు.


ఇక బీఆర్ఎస్ పై ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. నిన్న కేటీఆర్, హరీష్ రావులు చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం దోపిడీ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. తాము హైదరాబాద్ నగర వాసులకు భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకూడదని, చెరువులలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను ప్రవేశపెట్టామన్నారు. హైడ్రాను చూసి భయపడేవారు ఎవరో కాదు ఆక్రమణలకు పాల్పడిన వారేనన్నారు. కుంటలలో, నాలాలలో గృహాలు కట్టుకుంటే వరదలు వచ్చిన సమయంలో ఇబ్బందులు పడేది కూడా ప్రజలేనని గమనించాలన్నారు.

రాష్ట్రాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. అలాగే కేటీఆర్, హరీష్ రావులు తమ ఫామ్ హౌస్ లు కాపాడుకోవడానికి, పేదలను ముందు ఉంచుతున్నానన్నారు. మూసీ భాదితులకు తాము ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నా కూడా బీఆర్ఎస్ నేతలు సహించలేక పోతున్నారన్నారు. అన్నీ లంగా మాటలు.. దొంగ నాటకాలు చేస్తూ బుల్డోజర్ లకు అడ్డంగా తగులుతామని చెబుతున్నారని, కానీ నేను కూడా అవసరం లేదు.. మా సీనియర్ నాయకుడు హనుమంతరావు చాలన్నారు. హరీష్ రావు చెప్పులు మోసే రకమని, తన ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు మరచిపోయావా అంటూ హరీష్ రావును ఉద్దేశించి ప్రసంగించారు. మూసీ పునరుజ్జీవం కోసం తాము తాపత్రయ పడుతుంటే.. అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు. అజీజ్ నగర్ లో హరీష్ రావు, జన్వాడ లో కేటీఆర్ ఫామ్ హౌస్ లు ఆక్రమణలకు పాల్పడి నిర్మించారని, వాటిపై నిజనిర్ధారణ కమిటీ వేస్తామన్నారు.

Also Read: Budh Shukra Yuti: దీపావళికి ముందు ఈ 4 రాశుల వారు విపరీతమైన లాభాలు పొందబోతున్నారు

పేదప్రజల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఇటీవల ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించామన్నారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో విద్యాభివృద్దికై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యూనివర్శిటీలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్దికి కట్టుబడి పాలన సాగిస్తున్నామని, పేదల పక్షాన తానెప్పుడూ ఉంటానని సీఎం రేవంత్ అన్నారు.

Related News

Miyapur Chirutha Puli: మియాపూర్‌లో కనిపించింది చిరుత కాదా? మరేంటి? అధికారులు ఏమంటున్నారు? అయినా బీ అలర్ట్!

Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!

BRS leader ship change: అయ్యా గమ్మునుండు, నేను చూసుకుంటా.. ఆ సంకేతాలు దేనికి?

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Big Stories

×