EPAPER

Cm Revanth reddy: “రైతు పంటకు బీమా.. జీవితానికి ధీమా రెండూ ఇస్తాం..”

Cm Revanth reddy:  “రైతు పంటకు బీమా.. జీవితానికి ధీమా రెండూ ఇస్తాం..”

Cm Revanth reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు పంటలకు.. రైతు జీవితానికి బీమా, ధీమా రెండూ ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం కనీసం రైతులను బాధలను వినడానికి కూడా సాహసించలేనంత నియంతృత్వంగా పరిపాలించారన్నారు. ప్రజాస్వామ్యంలో మా ధర్నాచౌక్‌ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు మేం మళ్లీ ధర్నాచౌక్‌ను పునరుద్ధరించామన్నారు.


రైతులకు ఏ కష్టం వచ్చినా మేం పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. గత పదేళ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్ నివేదిక వెల్లడించిందన్నారు. పంటల భీమా అమలు చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవా..? అని ప్రతి పక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఓటమి తర్వాత అయిన బీఆర్ఎస్ లో మార్పు వస్తుందని ఆశించామన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడు అయినా సభలో ఇతరులకు అవకాశాలు ఇస్తారు అనుకున్నా ..కానీ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులే మాట్లాడడం గమనార్హం అన్నారు. మా పార్టీ మా ఇష్టం ఏమైనా చేసుకుంటాము అనుకున్నారు కానీ ఇది ఎక్కువ కాలం చెల్లదన్నారు. నిరంతృత్వం ఎక్కవ కాలం నిలవదన్నారు. రాష్ట్రాన్ని నియంతల్లా పాలించారు కాబట్టే ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు.


ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టి ప్రజలు తమ సమస్యలు స్వేచ్చగా విన్నవించుకుంటున్నారు. దీన్ని చూసి బీఆర్ఎస్ నేతలు కళ్లు మండి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 10ఏళ్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది మీరు కాదా ? అందుకే అధికారం ప్రజలకు మాకు అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ద్వజమెత్తారు.

గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే హోంగార్డులతో వెనక్కి పంపారన్నారు .ప్రజా గాయకుడు గద్దర్ ను కూడా అదే విధంగా అవమానించరన్నారు. గంటల కొద్దీ ఆయన ప్రగతి భవన్ గేటు ముందు నిలబడ్డారన్నారు. ఇది అంతా రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగిస్తమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ నిలుచొని నిరసన తెలిపినందుకు శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే గవర్నర్ ప్రసంగంలో పెట్టామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పడైనా అమరవీరుల కుటుంబీకులను ప్రగతి భవన్ కు పిలిచి గౌరవించారా ? కనీసం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డల కుటుంబాలను ఎప్పడైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయలేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనలో టిఎస్పిఎస్ పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పెట్టి అమ్మారన్నారు. కనీసం పదవ తరగతి పరీక్షలు సైతం సరిగ్గా నిర్వహించడం చేతకాలేదని దయ్యబట్టారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి ఎందుకు ఎక్కువ అయ్యిందన్నారు. పాఠశాల విద్యలో తెలంగాణ 31వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వెనుక పడేసిన పాపం మీది కాదా ? అని నిప్పులు చెరిగారు. గత పదేళ్ల తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్టీ నివేదికలో వెల్లడైందన్నారు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానం, పాఠశాల విద్యలో 35వ స్థానానికి పడిపోయిందన్నారు. రైతు బతికి ఉన్నప్పడు పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు రైతు చనిపోయిన తర్వాత రూ.5లక్షలు ఇచ్చిందని విమర్శించారు.

Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×