EPAPER

Sebi Scandal: బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం.. ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి

Sebi Scandal: బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం.. ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: సెబీ చైర్మన్ రాజీనామా, అదానీ వ్యవహారంపై జేపీసీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. అదానీ కుంభకోణంపై చట్టసభల్లో ప్రశ్నలు సంధిస్తే.. ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా పారిపోయారని ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వానిది ప్రజావ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ. 55 వేల కోట్లు అని, అదే పదకొండేళ్లలలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15 వేల కోట్లని వివరించారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే ఒక్క మోదీనే రెండింతల అప్పు చేశారని మండిపడ్డారు.


దేశ పురోగతిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రధాన పాత్ర పోషించాయని, దేశంలో సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూదేనని, బ్యాంకుల జాతీయకరణతో బ్యాంకింగ్ రంగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది, ఇందిరమ్మేనని తెలిపారు. సాహసోపేత నిర్ణయంతో ఆమె పేద ప్రజలకు భూములు పంచారని వివరించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానేత ఆయన అని చెప్పారు.

ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నవారు… హద్ దో.. హమారే దో అన్నట్టుగా మోదీ, అమిత్ షాల వ్యవహారం ఉన్నదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని దోచుకునేలానే ఆ ఇద్దరి శైలి ఉన్నదని తెలిపారు.దుష్టచతుష్టం దేశాన్ని దోచుకుంటున్నదని చెప్పారు. సెబీ చైర్‌పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. సెబీలో జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలన్నారు.


దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని, ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉన్నదని, అందుకే పార్టీ పిలుపును పాటిస్తూ ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసనలో పాల్గొనడానికి వచ్చానని రేవంత్ రెడ్డి వివరించారు. కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వాళ్లు విలీనమైతరో.. మలినతమైతరో అనవసరమని, కానీ, బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దేశ సంపదును దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ అనుకూలమేనని ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తున్నదని వివరించారు. జేపీసీ వేయాలన్న డిమాండ్ పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలన్నారు.

Also Read: Ex cm ys jagan: జగన్ సెక్యూరిటీ ఖర్చు నెలకు అంతా? ఇది దారుణం

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, వారి తాత ముత్తాతలు దిగి వచ్చినా అది సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు చేసుడేనని వార్నింగ్ ఇచ్చారు. ఎవడు తొలగిస్తాడో రావాలని, తారీఖు చెప్పాలని సవాల్ విసిరాడు. పదేళ్లకు బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు వారి మాటలు నమ్మి రోడ్డెక్కవద్దని సూచించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని.. తమ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నదనే రైతన్నల కోసమని చెప్పారు.

ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కీలక నాయకులు ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అదానీ కుంభకోణంపై విచారణ చేయాలని ఈడీ అధికారులకు వినతి పత్రం అందించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×