EPAPER

CM Revanth Reddy: ఆ లోటు భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..

CM Revanth Reddy: ఆ లోటు భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..

CM Revanth Reddy: ఒక పక్క సచివాలయం.. మరో వైపు అమరవీరుల స్థూపం. ట్యాంక్‌ బండ్‌పై ఎంతోమంది త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించామని సీఎం తెలిపారు. ఆ లోటు రాజీవ్‌ గాంధీ విగ్రహం లేకపోవడమేన్నారు. . సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు.


సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నామంటే.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే అందుకు కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో ఆయన ప్రాణాలు అర్పించారన్నారు. ఆయన దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.


Read More: నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. సమస్యను పరిష్కరిస్తాం.. సీఎం రేవంత్ హామీ.

వర్ధంతి, జయంతికి దండలేసి దండం పెట్టుకోవడానికి కాదు విగ్రహాలు పెట్టేది అని రేవంత్ రెడ్డి అన్నారు. వారి ఆశయాలను గుర్తు చేసుకోవడానికి అన్నారు. సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెడితే ఇటువైపు వచ్చే వారిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఒక ఆదర్శ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం నా జీవితాంతం గుర్తుంటుందని సీఎం పేర్కొన్నారు. సద్భావన యాత్రలో చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగేలా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×