EPAPER

Hydra Demolitions: హైడ్రా నోటీసుల పేరుతో డబ్బులు వసూలు.. సీరియసైన సీఎం రేవంత్ రెడ్డి

Hydra Demolitions: హైడ్రా నోటీసుల పేరుతో డబ్బులు వసూలు.. సీరియసైన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Responded: హైడ్రా పేరుతో పలువురు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని, పలు చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇతర అధికారులపై కూడా తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. అదేవిధంగా ఈ విషయంపై దృష్టి సారించాలంటూ ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వసూళ్లకు పాల్పడేవారిపై దృష్టి పెట్టి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.


Also Read: హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. నిబంధనల ప్రకారం నా ఇల్లు లేకుంటే..

కాగా, చెరువుల ఆక్రమణపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నది. నగరంలో ఉన్న చెరువు పరిసర ప్రాంతాలపై హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చెరువుల చుట్టు పక్కల ప్రాంతాలను ఆక్రమించినవారు, ఇండ్లు కట్టుకున్నవారిపై ఆరా తీస్తున్నది. నివాసిత ఇళ్లు, అపార్టుమెంట్లు పెద్ద ఎత్తున కట్టుకున్నట్లుగా హైడ్రా తన విచారణలో తేల్చింది. కేవలం అద్దెల రూపంలోనే లక్షల రూపాయలను వారు ఆర్జిస్తున్నారు. అయితే, వర్షం వచ్చినప్పుడల్లా నీరు పోయే మార్గం లేక వరద నీరు రోడ్డు పైకి, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరడంతో నిర్వాసితులు గతంలో చాలా సార్లు ఫిర్యాదులు చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఎన్ -కన్వెన్షన్. దానిని కూడా కూల్చివేయడంతో పెద్ద ఎత్తున హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. అదే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. వాటిపైనా కూడా హైడ్రా స్పెషల్ గా ఫోకస్ పెట్టాలంటున్నారు. అయితే, హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు తమను వేధిస్తున్నారంటూ పలువురు ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొంటున్నారు.


Also Read: దుర్గంచెరువు పరిసర ప్రాంతాల వాసులు హడలిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఇదిలా ఉంటే.. హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో ఆమె భేటీ అయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవలే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ తోపాటు ఇతర అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె చర్చించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×