EPAPER

Revanth Reddy: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని రుజువైంది

Revanth Reddy: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని రుజువైంది

Farm Loan Waiver: కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని మరోసారి రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణను ఇచ్చారని, కరీంనగర్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. వరంగల్‌లో 2022 మే 6న నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చారని, ఆరు గ్యారెంటీలను తుక్కగూడ సభలో ప్రకటించిన సోనియా గాంధీ కూడా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని వివరించారు. ఈ హామీని ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేస్తున్నామని వివరించారు. దీంతో కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని మరోసారి నిరూపితమైందని చెప్పారు.


గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారని, మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ. 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 12 వేల కోట్లు మాత్రమే చేశారని సీఎం గుర్తు చేశారు. రెండోసారి రూ. 12 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. కానీ, తాము సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు రూ. 6,098 కోట్లు రూపాయాలను రుణమాఫీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు.

కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ చేస్తున్నామని, సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రూ. 1 లక్షలోపు రుణాలున్న రైతులకు ఈ రోజు విముక్తి కల్పించామని, లక్షన్న రూపాయల రుణాలున్న వారికి ఈ నెలాఖరులో విముక్తి కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని వివరించారు. తన 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజుని, రుణమాఫీ చేసే భాగ్యం తనకు కలిగిందని తెలిపారు.


రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ జరుగుతుందని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, అదంతా అవాస్తవం అని కొట్టిపారేశారు. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ నిధులు విడుదల

గత ప్రభుత్వం అప్పులకు మిత్తిగా ప్రతి నెలా సుమారు ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఏడు నెలల్లో సంక్షేమ కార్యక్రమాలకు రూ. 29 వేల కోట్లు చెల్లించామని వివరించారు. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ రోల్ మాడల్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పిన వ్యక్తిని రాజీనామా చేయమని అడగబోమని, కానీ, గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని తెలుసుకుంటే చాలని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని సీఎం వివరించారు. రుణమాఫీ సందర్భంగా వరంగల్‌లో బహిరంగ భ నిర్వహిస్తామని, ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని, త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి తెలంగాణకు ఆహ్వానిస్తామని వివరించారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×