EPAPER

Telangana Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. ఆమోదం తెలిపిన సభ

Telangana Assembly: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం.. ఆమోదం తెలిపిన సభ

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల కౌంటర్, ప్రతి కౌంటర్లతో శాసన సభ దద్దరిల్లిపోతుంది. ఈసారి బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలి.. అలా చేస్తే తాము కూడా మద్దతిస్తామంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తప్పకుండా జంతర్ మంతర్ దగ్గర దీక్షకు కూర్చుందాం. దీక్షకు విపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చామని మేం చెప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అందరం దీక్ష చేద్దాం. సచ్చుడో లేదా తెలంగాణకు నిధులు తెచ్చుడో చూద్దాం’ అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.


అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘కేంద్ర బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధానిని ఎన్నో అడిగాం.. ఒక్కటీ ఇవ్వలేదు. సభను ప్రతిపక్షం తప్పుదారి పట్టిస్తోంది. ప్రశ్నోత్తరాల తరువాత తీర్మానం ఉంటుందని చెప్పాం. మేం అంశాన్ని ముందే చెప్పి చర్చకు పెట్టాం. బడ్జెట్ పై నిరాశతోనే ఇవాళ చర్చ పెట్టాం. మా ప్రతిపాదనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ దేశంలో భాగం కాదా? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించింది. కేంద్రం తీరుతో రాష్ట్రాలన్నీ ఆలోచనలో పడ్డాయి. తెలంగాణను కేంద్రం గాలికి వదిలేసింది. బీజేపీతో కలిసి తిరిగింది బీఆర్ఎస్సే. లక్షలాది ఎకరాలు మునగడానికి కారణం బీఆర్ఎస్సే. 7 మండలాల కోసం బీఆర్ఎస్ పోరాడలేదు. సీతారామ ప్రాజెక్టును కట్టింది బీఆర్ఎస్ కాదు’ అంటూ భట్టి పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం


ఇదిలా ఉంటే.. కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన కాపీలను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఆ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపరిచారు. గడిచిన పదేళ్ల ఆ చట్టాలను అమలు చేయలేదు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశాం. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించాం. రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరాం. కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు.. కక్ష’ అంటూ రేవంత్ పేర్కొన్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×